TTD EO INAUGURATES SOLAR PLANT _ తితిదే పరిపాలనా భవనంలో సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ప్రారంభం

TIRUPATI, JUNE 19:  TTD EO Sri LV Subramanyam on Wednesday inaugurated the solar photo-voltaic rooftop power plant in TTD administrative building in Tirupati.

Addressing the occasion, the EO said, TTD trust board member Sri L Siva Prasad took keen interest behind this non-conventional energy project. 

“The L&T ltd., Aeon Renewable Energy solutions(P)ltd. and Crux Industries India(P) Ltd. from Chennai installed this 100KWp solar power plant on TTD administrative building at a cost of Rs.1.25cr. This is an eco-friendly plant which friendly project which saves approximately 100 tonnes of carbon emission annually”, he added.

The EO also said, TTD is already utilising wind mill energy in Tirumala to meet the partial needs of power consumption in Tirumala. “This new solar power plant will meet the partial needs of the office by generating approximately 1.5lakh units per annum”, he maintained

Later the EO felicitated the representatives from three firms who have installed this 1.25cr project on free of cost to TTD. The EO also felicitated TTD CE Sri Chandrasekhar Reddy, Energy Manager Sri Somasekhar. Tirupati JEO Sri P Venkatrami Reddy, SE Electrical Sri Venakteswarulu and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తితిదే పరిపాలనా భవనంలో సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ప్రారంభం

తిరుపతి, జూన్‌ 19, 2013: తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో 100 కిలోవాట్ల సామర్థ్యం గల సౌరవిద్యుత్‌ ప్లాంటును తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం బుధవారం ఉదయం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తితిదే పాలకమండలి సభ్యులు శ్రీ శివప్రసాద్‌ చొరవ తీసుకుని పూర్తిగా విరాళాలతో సౌర విద్యుత్‌ ప్లాంటు ఏర్పాటుకు కృషి చేసినట్టు తెలిపారు. తితిదే పరిపాలనా భవనంలో ఈ ప్లాంటు ఏర్పాటు వల్ల మొత్తం విద్యుత్‌ అవసరాల్లో పది శాతం తీరుతుందని వివరించారు. సంవత్సరానికి రూ.12 లక్షల విలువైన విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు. ఇటీవల కాలంలో చాలా కార్యాలయాల్లో సౌరవిద్యుత్‌ను వినియోగిస్తున్నారని, ప్రత్యేకించి ఈ ప్లాంటు వల్ల సంవత్సరానికి 100 టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ వాతావరణంలో కలవకుండా పర్యావరణాన్ని పరిరక్షించినట్లు అవుతుందన్నారు. తిరుమలలో గాలిమరల ద్వారా పవన విద్యుత్‌ను మరింతగా ఉత్పత్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు. అదేవిధంగా స్థానిక ఆలయాల్లో సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు.

అంతకుముందు సౌర విద్యుత్‌ ప్లాంటుకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్లాంటు ఏర్పాటుకు విరాళంగా పరికరాలను అందించిన దాతలను ఈవో సన్మానించారు. ప్లాంటు ఏర్పాటుకు విశేషంగా కృషి చేసిన తితిదే చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి, ఎనర్జీ మేనేజర్‌ శ్రీ సోమశేఖర్‌ను ఈవో అభినందించారు. కాగా, చెన్నైకి చెందిన ఎల్‌ అండ్‌ టి లిమిటెడ్‌, ఏయోన్‌ రెనెవబుల్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, క్రక్స్‌ ఇండస్ట్రీస్‌ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌ సంస్థలు సంయుక్తంగా రూ.కోటి 25 లక్షల వ్యయం గల ఈ ప్లాంటును పూర్తిగా విరాళంగా ఏర్పాటుచేశాయి.
ఈ కార్యక్రమంలో తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి,  ఎస్‌ఇ ఎలక్ట్రికల్స్‌ శ్రీ వేంకటేశ్వర్లు, చెన్నై స్థానిక సలహా మండలి సభ్యులు, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.