LAKSHA KUMKUMARCHANA PERFORMED AT SRI PAT _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా లక్షకుంకుమార్చన

Tiruchanoor, 22 Nov. 19: As a part of ensuing Kartheeka Brahmotsavams of Sri Padmavathi Ammavari Temple at Tiruchanoor, Laksha Kumkumarchana was performed on Friday morning.

Kumkuma or Vermilion has a great significance in Hindu Sanatana Dharma where married women wear Sindhoor on their forehead seeking the longeivity of their husbands.

The event is conducted ahead of mega festivities like Brahmotsavams to ensure a hassle free conduction through out nine days.

The Archana is performed at the Sri Krishna mandapam between 8am and12 noon on Friday reciting the 1000 divine names of Goddess Lakshmi. Thousands of women devotees took part in this ritual.

DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, archakas and other officials and devotees participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా లక్షకుంకుమార్చన

తిరుప‌తి, 2019 న‌వంబ‌రు 22: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్ర‌వారం ఉదయం లక్ష కుంకుమార్చన సేవ వైభవంగా జరిగింది.

హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. వివాహితురాలైన  మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుష్షు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోంది. లక్ష్మి, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేర్లతో పిలుస్తున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్త్యం ఉంది. అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని అర్చకులు తెలిపారు.

ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆశీనులను చేసి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మి అష్టోత్తరం, లక్ష్మి సహస్రనామాలను వళ్లిస్తూ అమ్మవారిని కుంకుమతో అర్చన చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ సేవలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబమ్రణ్యం, అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఘనంగా అంకురార్పణ :

బ్ర‌హ్మోత్స‌వాల నేప‌థ్యంలో శుక్ర‌వారం సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఇందులో భాగంగా పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహిస్తారు.

న‌వంబ‌రు 23న ధ్వజారోహణం :

ఆలయంలో శ‌నివారం ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ధ్వజస్థంభ తిరుమంజనం, ఉదయం 8 నుండి 9 గంటల నడుమ వృశ్చిక లగ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమ‌వుతాయి. రాత్రి 7.30 నుంచి 11 గంటల వరకు చిన్నశేష వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.