ARRANGEMENTS COMPLETE FOR FLOWER-FRUIT EXHIBITION AT FRIDAY GARDENS FOR SRI PAT BTUs _ శుక్ర‌వార‌పుతోట‌లో ఫ‌ల‌పుష్ప ప్ర‌ద‌ర్శ‌న‌శాల ఏర్పాట్లు పూర్తి

Tiruchanoor, 22 November 2019: TTD garden department has made elaborate arrangements for conduction of flower-fruit exhibition at Friday Gardens in Tiruchanoor as a part of the annual Kartheeka Brahmotsavams of Sri Padmavathi Ammavari Temple which are set to commence from November 23.

The colourful display of 25 seasonal flowers and fruits with mythological episodes will enthral the devotees. The flowers included Petronia, Bigonia, and Salvia etc. Were used in setting up the dioramas.

Nearly ten mythological episodes including Ashtalakshmi vaibhavam, Adiparasakti, Dashavataras etc. are organised said TTD Garden Superintendent Sri Srinivasulu.

SAIKAT ART OF SRI LAKSHMI VARAHASWAMY

As a part of the exhibition the TTD has also put up a colourful and attractive Saikat art by Mysore sisters Ms.Nilambari and Ms.Gowri with one truckload of sand.

Similarly the SV Ayurveda college is also put up Ayurveda Exhibition and display of herbs and ancient medicine SV Ayurveda pharmacy besides Ayurveda medical camp and SV traditional temple sculpture training Center are also put their works on display.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శుక్ర‌వార‌పుతోట‌లో ఫ‌ల‌పుష్ప ప్ర‌ద‌ర్శ‌న‌శాల ఏర్పాట్లు పూర్తి

తిరుప‌తి, 2019 న‌వంబ‌రు 22: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్ర‌వార‌పుతోట‌లో ఫ‌ల‌పుష్ప ప్ర‌ద‌ర్శ‌న‌శాలకు టిటిడి ఉద్యాన‌వ‌న విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది. రంగురంగుల పుష్పాలు, ఫ‌లాలు, పౌరాణిక ఘ‌ట్టాల‌తో ఈ ప్ర‌ద‌ర్శ‌న భ‌క్తుల‌కు క‌నువిందు చేయ‌నుంది.

ఫల‌పుష్ప ప్ర‌ద‌ర్శ‌న‌శాల‌లో 25 వేల సీజ‌న‌ల్ పుష్పాల మొక్క‌ల‌ను ఏర్పాటుచేశారు. వీటిలో చామంతి, రోజాలు, పెట్రోనియా, బిగోనియా, సాల్వియా త‌దిత‌ర జాతుల పూల మొక్క‌లున్నాయి.  అదేవిధంగా, పూల‌తో ఏనుగు, క‌ల‌శం, సీతాకోక‌చిలుక‌, డాల్ఫిన్లు, గొడుగు త‌దిత‌ర ఆకృతుల‌ను తీర్చిదిద్దారు. మొత్తం 10 పౌరాణిక ఘ‌ట్టాల సెట్టింగుల‌ను ఏర్పాటుచేశారు. వీటిలో అష్ట‌ల‌క్ష్మీ వైభ‌వం, ఆదిప‌రాశ‌క్తి – ద‌శావ‌తారాలు త‌దిత‌ర సెట్టింగులు ఉన్న‌ట్టు టిటిడి ఉద్యానవ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులుతెలిపారు.

ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా శ్రీ ల‌క్ష్మీవ‌రాహ‌స్వామి సైక‌త శిల్పం

ఫల‌పుష్ప ప్ర‌ద‌ర్శ‌న‌శాల‌లో భాగంగా శ్రీ ల‌క్ష్మీవ‌రాహ‌స్వామి సైక‌త శిల్పాన్ని ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా తీర్చిదిద్దుతున్నారు. మైసూరుకు చెందిన నీలాంబ‌రి, గౌరి అనే యువ‌తులు ఒక ట్ర‌క్కు ఇసుక‌తో మూడు రోజులుగా సైక‌త శిల్పాన్ని రూపొందిస్తున్నారు. వీరు తిరుమ‌ల శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లోనూ ప్ర‌తి ఏడాదీ  సైక‌త శిల్పాల‌ను రూపొందిస్తున్నారు.

అదేవిధంగా, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఆయుర్వేద ప్ర‌ద‌ర్శ‌న‌శాల‌, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసి ఆధ్వర్యంలో వనమూలికా ప్రదర్శన, ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం, ఎస్వీ సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో క‌ళ‌ల ప్రదర్శనశాల ఏర్పాటుచేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.