LAKSHMI KASULA MALA REACHES TIRUCHANOOR _ తిరుచానూరులో వైభవంగా లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర‌

Tiruchanoor, 27 Nov. 19: In a grand procession, the Lakshmi kasula haram reached Tiruchanoor on Wednesday from Tirumala amidst tight security. 

Speaking on this occasion, TTD EO Sri Anil Kumar Singhal said, this jewel which is decked to Sri Malayappa Swamy during every Pournami Garuda Seva will be decorated to Gaja and Garuda Vahana sevas of Ammavaru every year. 

Meanwhile on wednesday evening, this kasula haram will be decorated to Goddess during Gaja Vahanam procession. 

Addl EO Sri AV Dharma Reddy, Temple DyEO (FAC) Sri C Govindarajan, VSO Sri Prabhakar, Srivari Temple AEO Sri Lokanadham and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI 

తిరుచానూరులో వైభవంగా లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర‌

గ‌జ‌, గ‌రుడ వాహ‌నాల్లో అమ్మ‌వారికి అలంక‌ర‌ణ‌

తిరుపతి, 2019 నవంబరు 27: తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర బుధ‌వారం తిరుచానూరులో వైభ‌వంగా జ‌రిగింది. ముందుగా తిరుమల శ్రీ‌వారి ఆల‌యం నుండి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, పేష్కార్ శ్రీ లోక‌నాథం, శ్రీ‌వారి ఆల‌య ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి క‌లిసి లక్ష్మీ కాసులహారాన్ని తిరుచానూరులోని ప‌సుపుమండ‌పం వద్దకు తీసుకొచ్చారు. అక్క‌డ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంత‌రం మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్రగా మాడ వీధుల గుండా ఆలయానికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌ మాట్లాడుతూ శ్రీ‌వారి ఆభ‌ర‌ణాల‌లో లక్ష్మీ కాసులహారం అత్యంత ప్ర‌ధాన‌మైంద‌ని, పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ సంద‌ర్భంగా ఈ హారాన్ని శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి అలంక‌రిస్తామ‌ని తెలిపారు. సాక్షాత్తు స్వామివారు ధ‌రించే ఈ హారాన్ని గజవాహనం, గరుడవాహన సేవల సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి అలంకరించడం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌న్నారు. బుధ‌వారం రాత్రి జ‌రుగ‌నున్న గ‌జ వాహ‌నానికి విస్తృతంగా ఏర్పాట్లు చేసిన‌ట్టు తెలిపారు. బ్ర‌హ్మోత్స‌వాల కోసం రూ.1.44 కోట్ల‌తో ఇంజినీరింగ్ ప‌నులు చేప‌ట్టామ‌ని, భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా పుష్ప ప్ర‌ద‌ర్శ‌న‌శాల‌, పుష్పాలంక‌ర‌ణ‌లు, విద్యుద్దీపాలంక‌ర‌ణ‌లు చేశామ‌ని, రోజుకు 5 వేల మంది భ‌క్తులకు అన్న‌ప్ర‌సాదాలు అందిస్తున్నామ‌ని వివ‌రించారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి విఎస్వో శ్రీ ప్ర‌భాక‌ర్‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, ఏవిఎస్వో శ్రీ నందీశ్వ‌ర్‌రావు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.