STRAW AND BLACK BERRIES ENHANCE THE GLAMOUR OF GODDESS DURING SNAPANAM _ దానిమ్మ‌, అన‌ప‌, స్ట్రాబెరీ, వృక్షి, బ్లాక్‌బెర్రీ మాల‌ల‌తో వేడుక‌గా స్న‌ప‌న‌తిరుమంజ‌నం

Tiruchanoor, 27 Nov. 19: The Goddess Padmavathi who sits on Riches being the Goddess of Riches, Prosperity and Wealth in all Her resplendence underwent Snapana Tirumanjanam on the fifth day.

The Goddess after being offered celestial bath with milk, curd, coconut, honey, turmeric and sandal paste was decorated with a unique set of garlands and crown made of Pomegranate seeds, Strawberry, Black berry etc. in a colourful manner.  

Eight types of garlands have been changed, each time when the Goddess has been offered with the celestial snapanam. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI 

దానిమ్మ‌, అన‌ప‌, స్ట్రాబెరీ, వృక్షి, బ్లాక్‌బెర్రీ మాల‌ల‌తో వేడుక‌గా స్న‌ప‌న‌తిరుమంజ‌నం

తిరుపతి, న‌వంబ‌రు 27, 2019: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన బుధ‌వారం దానిమ్మ‌, అన‌ప‌, స్ట్రాబెరీ, వృక్షి, బ్లాక్‌బెర్రీ త‌దిత‌ర మాల‌ల‌తో అమ్మవారికి స్నపనతిరుమంజనం వేడుక‌గా జరిగింది. మధ్యాహ్నం 12.30 నుండి 2.30 గంటల వరకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో శ్రీపాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక నిర్వ‌హించారు.

కంకణభట్టర్‌ శ్రీ వేంప‌ల్లి శ్రీ‌నివాసులు ఆధ్వర్యంలో ఈ విశేష కార్య‌క్ర‌మం జరిగింది. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం  నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను పాంచరాత్ర ఆగమయుక్తంగా నిర్వహించారు.

ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఎనిమిది రకాల మాలలను అమ్మవారికి అలంకరించారు. ఇందులో దానిమ్మ‌, అన‌ప‌, స్ట్రాబెరీ, చామంతితో క‌లిపిన‌ వృక్షి, బ్లాక్‌బెర్రీ, కిస్‌మిస్‌, రోజా, తుల‌సి మాల‌ల‌ను అమ్మవారికి అలంకరించారు. మ‌ధ్య‌లో ప‌లుర‌కాల ఫ‌లాల‌ను నివేదించారు. టిటిడి ఉద్యాన‌వ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు ఆధ్వ‌ర్యంలో మాల‌ల‌ను రూపొందించారు.
       
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.