SRIVARI SEVAKS OFFER COMMENDABLE SERVICES IN SRI PAT _ తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారి సేవలో శ్రీవారి సేవకులు

Tiruchanoor, 30 Nov. 19: The Srivari Seva volunteers offered impeccable services to pilgrims during the ongoing annual brahmotsavams at Tiruchanoor. 

Every day 350 sevaks were deployed at Vahanam, temple, annaprasadam centre, food counters,  water distribution points, first aid centres, publication stalls etc.during this mega religious event. 

However on the day of Panchami Theertham, apart from 350 another 150 volunteers from Tirumala seva have also been deployed for the fete. 

Apart from the sevaks, 200 scoit students have also offered services to pilgrims during business. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

 

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారి సేవలో శ్రీవారి సేవకులు

తిరుపతి, 2019 న‌వంబ‌రు 30: తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి కార్తీక బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న వేలాది మంది భక్తులకు శ్రీవారి సేవకులు విశేష సేవలందిస్తున్నారు.

”మానవసేవయే మాధవసేవగా” భావించి టిటిడి 2000వ సంవత్సరంలో తిరుమలలో ”శ్రీవారి సేవ” స్వచ్ఛంద సేవను ప్రారంభించింది. అప్పటి నుండి తిరుమలకు విచ్చేసే భక్తులకు శ్రీవారి సేవకులు విశేష సేవలందిస్తున్నారు. టిటిడి అనుబంధ ఆలయాల్లో ఉత్సవాలు, పర్వదినాల సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లోని శ్రీవారి సేవకులు భక్తులకు విశేష సేవలందిస్తునారు. టిటిడి స్థానికంగా ఉన్న వారి సేవలను వినియోగించుకుంటూ వారికి తగిన ప్రాధాన్యత ఇస్తూ, వారిని భాగస్వాములను చేస్తోంది. దేశ విదేశాలలో టిటిడి నిర్వహించే ధర్మప్రచార కార్యక్రమాలైన మనగుడి, కైశిక ద్వాదశి, గోపూజ, శ్రీనివాస కల్యాణాలు, శ్రీవేంటేశ్వరస్వామివారి వైభవోత్సవాలలో విశేష సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొని సేవలందిస్తున్నారు.

వాహ‌న‌సేవ‌ల్లో శ్రీ‌వారి సేవ‌కుల సేవ‌లు

బ్ర‌హ్మోత్స‌వాల్లో ఉద‌యం, రాత్రి జ‌రిగే వాహ‌న‌సేవ‌ల్లో శ్రీ‌వారి సేవ‌కులు చ‌క్క‌టి సేవ‌లందిస్తున్నారు. హార‌తులు ఇచ్చేందుకు వ‌స్తున్న భ‌క్తుల క్యూల‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించ‌డం,  క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌లిస్తున్న క‌ళాకారుల‌కు తాగునీరు అందించ‌డం, క‌ళాబృందాల వ‌ద్ద రోప్ పార్టీగా సేవ‌లందించ‌డం వంటివి చేస్తున్నారు. అదేవిధంగా, శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆలయం, ఆస్థాన‌మండ‌పం, క్యూలైన్లు, అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాల్లో శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో 350 మంది, పంచ‌మితీర్థం రోజు 500 మంది శ్రీవారి సేవకులు అందుబాటులో ఉంటారు. శ్రీ‌వారి సేవ‌కుల‌తో పాటు 200 మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్ భ‌క్తుల‌కు సేవ‌లందిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.