JEO INSPECTS ARRANGEMENTS _ పంచ‌మి తీర్థానికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

Tiruchanoor, 30 Nov. 19: JEO Sri P Basanth Kumar on Saturday inspected arrangements at Padma Pushkarini for Panchami Theertham along with officials. 

He verified the entry and exit gates surrounding the pushkarini. 

Later he said all arrangements are in place for the grand finale event. “We have set up 160 food counters and 188 temporary toilets. The devotees are accommodated in ZP High school and from there will be allpwed to enter in Padma Pushkarini in a phased manner to avoid any untoward situation. 

Additional CVSO Sri Siva Kumar Reddy, SE Electrical Sri Venkateswarulu, trmple DyEO Sri C Govindarajan were also present. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

పంచ‌మి తీర్థానికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

తిరుపతి, 2019 న‌వంబ‌రు 30:  తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల చివ‌రిరోజైన‌ డిసెంబ‌రు 1న పంచ‌మితీర్థానికి విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉండ‌డంతో విస్తృతంగా ఏర్పాట్లు చేప‌డుతున్న‌ట్టు టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ తెలిపారు.
   
తిరుచానూరులో పంచ‌మితీర్థం ఏర్పాట్ల‌ను జెఈవో శ‌నివారం త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా పుష్క‌రిణిలో గేట్లు, పంచ‌మితీర్థ మండ‌పాన్ని ప‌రిశీలించారు. భ‌క్తులు ఇబ్బందులు ప‌డ‌కుండా పుష్క‌రిణిలోనికి ప్ర‌వేశించేందుకు, తిరిగి బ‌య‌ట‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అంత‌కుముందు ఆస్థాన‌మండ‌పంలో అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.

 ఈ సంద‌ర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ పంచ‌మితీర్థానికి వ‌చ్చే భ‌క్తుల ర‌ద్దీని క్ర‌మ‌బ‌ద్ధీక‌రించేందుకు ప‌టిష్టంగా క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేశామ‌న్నారు. భ‌క్తుల కోసం 160 అన్న‌ప్ర‌సాదం కౌంట‌ర్లు, 188 మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు. తిరుచానూరులోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల మైదానంలో భ‌క్తులు ఉండేందుకు ఏర్పాట్లు చేశామ‌ని, అక్క‌డి నుండి విడ‌త‌ల వారీగా పుష్క‌రిణిలోకి అనుమ‌తిస్తామ‌ని తెలిపారు. పంచ‌మితీర్థం ప్ర‌భావం 48 గంట‌ల పాటు ఉంటుంద‌ని, భ‌క్తులు సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించి పుణ్య‌స్నానాలు ఆచ‌రించాల‌ని కోరారు.

ఈ స‌మావేశంలో టిటిడి అద‌న‌పు సివిఎస్‌వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఎస్ఇ(ఎల‌క్ట్రిక‌ల్స్‌) శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్, డిఇ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, ఎవిఎస్వో శ్రీ నందీశ్వ‌ర‌రావు, సూప‌రింటెండెంట్ శ్రీ గోపాల‌కృష్ణారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.