GARBAGE BAGS IN RTC BUSES SOON- TTD EO _ తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లోనూ భక్తుల నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించాలి – టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి 

Tirumala, 24 June 2023: TTD EO Sri AV Dharma Reddy on Saturday directed officials concerned to arrange garbage bags in RTC buses coming to Tirumala, to collect plastic waste garbage from devotees travelling buses.

Addressing a review meeting at Sri Padmavati Rest House in Tirupati, the TTD EO directed officials to arrange the removal of garbage including plastic wastes on ghat roads and footpaths as well at regular intervals.

Among others he asked officials to speed up works on Srinivas Sethu, Sri Matrusri Vengamamba Dhyan Mandir, set up electricity meters by July in Tirumala, Ghee plant at SV Goshala, “Veda Vijnan Tarangini” episodes in SVBC, Bharathiya Vijnan Dhara” episodes by SVBC for social media, pending electrical and engineering works at SVIMS hospital and canteens at all TTD hospitals to provide quality food to patients etc.

TTD JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam,  SVBC CEO Sri Shanmukh Kumar, FA & CAO Sri Balaji, CE Sri Nageswara Rao, SVIMS VC Dr Vengamma, VC of SV Vedic University Acharya Rani Sadashiv Murti, Chief Audit Officer Sri Sesha Shailendra were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లోనూ భక్తుల నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించాలి – టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
 
 తిరుమల, 24 జూన్ 2023: తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లోనూ గార్బేజ్ బ్యాగులు ఏర్పాటుచేసి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శనివారం సీనియర్ అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఘాట్ రోడ్లు, నడకదారుల్లో రోడ్డుకు ఇరువైపులా ప్లాస్టిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. తిరుపతిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న శ్రీనివాస సేతు పనులను పూర్తి చేసేందుకు రైల్వే అధికారులు, స్మార్ట్ సిటీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని చీఫ్ ఇంజినీర్ ను ఆదేశించారు. 
 
తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం పనులను నిర్దేశిత వ్యవధిలోపు పూర్తి చేయాలని ఈవో సూచించారు. తిరుమలలో విద్యుత్ మీటర్ల ఏర్పాటు పనులను జూలై లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. నెయ్యి ప్లాంట్ యంత్రసామగ్రి ఏర్పాటు, ఇతర పనులను వేగవంతం చేయాలని ఇంజినీరింగ్, గోశాల అధికారులకు సూచించారు. ఎస్వీబీసీలో ప్రసారం చేసేందుకు వీలుగా “వేద విజ్ఞాన తరంగిణి” పేరుతో ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో రూపొందిస్తున్న ఎపిసోడ్లను త్వరగా పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో ప్రసారం చేసేందుకు ఎస్వీబీసీ రూపొందిస్తున్న “భారతీయ విజ్ఞాన ధార” కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. స్విమ్స్ ఆసుపత్రిలో పెండింగులో ఉన్న ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ పనులను వేగవంతం చేయాలని కోరారు. టీటీడీ పరిధిలోని అన్ని ఆసుపత్రుల్లో రోగులకు,  సిబ్బందికి నాణ్యమైన ఆహారం అందించేందుకు క్యాంటీన్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు.
 
ఈ సమీక్షలో జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, ఎఫ్ఏసిఎఓ శ్రీ బాలాజీ,  చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, స్విమ్స్ ఉపకులపతి డాక్టర్ వెంగమ్మ, వేదవర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ శేష శైలేంద్ర తదితరులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.