PALLAVOTSAVAM HELD _ తిరుమలలో ఘనంగా పల్లవోత్సవం

Tirumala, 26 July 2023: TTD on Wednesday observed the Pallavotsavam fete marking the annual Birth anniversary of Mysore Maharaja Krishnaraja Wadayar.

The fete was held after the Sahasra Deepalankara seva and the utsava idols of Sri Malayappa swami and His consorts reached the Karnataka Choultries and received the honors of  Mysore Samsthan. 

Thereafter the representatives of the Karnataka Government and Mysore Samsthan offered special puja and harati, naivedhyam and Prasadam to the deities. 

TTD EO Sri AV Dharma Reddy, TTD Board Member Sri Viswanath and representatives of the Karnataka Government were present. 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో ఘనంగా పల్లవోత్సవం

తిరుమల, 2023 జూలై 26: తిరుమలలో బుధవారంనాడు పల్లవోత్సవం ఘనంగా జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టీటీడీ పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేశారు. మైసూర్‌ సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు.

అనంతరం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ విశ్వనాథ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.