SRINIVASA CHATURVEDA HAVANAM IN VARANASI _ జూలై 28 నుంచి ఆగష్టు 3వ తేదీ వరకు వారణాశి లో చతుర్వేద హవనం

TIRUPATI, 26 JULY 2023: Sri Srinivasa Chaturveda Havanam is all set to take place in one of the most renowned pilgrim centres in the country, Varanasi from July 28 to August 3 by TTD.

Seeking the divine intervention to ward off the evil forces, natural calamities and bestow prosperity and health in the lives of people, TTD is observing this seven-day fete with versatile Vedic pundits.

Sri Venkateswara Institute of Higher Vedic Studies Dr Vibhishana Sharma is supervising the arrangements for this religious fete.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 28 నుంచి ఆగష్టు 3వ తేదీ వరకు వారణాశి లో చతుర్వేద హవనం

తిరుమల26 జూలై 2023: వారణాశి లోని శివాల ప్రాంతం సమీపంలోని చాట్ సింగ్ ఫోర్ట్ వద్ద జూలై 28 నుంచి ఆగష్టు 3వ తేదీ వరకు ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస చతుర్వేద హవనం కార్యక్రమం నిర్వహించనున్నారు.

లోకక్షేమం, ఆరోగ్యం, ఐశ్వర్య వృద్ధి కొరకు అలాగే, అతివృష్టి, అనావృష్టి నుంచి ప్రపంచాన్ని కాపాడాలని ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా హోమ గుండాలు ఏర్పాటు చేసి ఏడు రోజుల పాటు నాలుగు వేదాల్లోని అన్ని మంత్రాలను పఠించి యజ్ఞేశ్వరునికి సమర్పణ చేస్తారు.

ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి డాక్టర్ విభీషణ శర్మ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.