ENDOWMENT MINISTER CONSOLES INJURED PILGRIMS _ తిరుమల కనుమ ప్రమాద బాధితులకు దేవాదాయ శాఖ మంత్రి పరామర్శ

TIRUPATI, MAY 28:  The Hon’ble Minsiter of Endowments of Andhra Pradesh, Sri C Ramachandraiah on Tuesday consoled the pilgrims were seriously injured in the ghat road accident that took place in Tirumala ghat on Monday in SVIMS hospital along with TTD JEO, Tirupati Sri P Venkatrami Reddy.

Later speaking to media persons he said, the negligence driving coupled by overspeed by the jeep driver led to misery. He expressed his deep felt condolences to the families of deceased. “TTD has resolved some traffic norms which will be henceforth implemented in a strict manner. For us the pilgrims safety is more important than anything else”, he maintained.

Speaking to media, Tirupati JEO said, TTD has taken some stern guidelines to put a check to ghat road mishaps. As per the guidelines, the health of the driver, condition of the vehicle, duration of ghat road travel time etc. will be taken into account. There will be checking even in the mid way of the ghat roads. More awareness workshops and classes will be taken for the drivers to prevent accidents”, he said

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల కనుమ ప్రమాద బాధితులకు దేవాదాయ శాఖ మంత్రి పరామర్శ

తిరుపతి, మే 28, 2013: తిరుమల-తిరుపతి కనుమలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గౌ|| సి.రామచంద్రయ్య మంగళవారం పరామర్శించారు. తితిదే తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డితో కలిసి ఆయన స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న యాత్రికుల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు విలేకరులతో మాట్లాడుతూ డ్రైవరు బాధ్యతారహితంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. తిరుమల కనుమలో ప్రయివేటు ట్యాక్సీల వేగాన్ని నియంత్రించేందుకు తితిదే చర్యలు చేపడుతోందన్నారు. వాహనం కండిషన్‌, డ్రైవరు ఆరోగ్యపరిస్థితి, వాహనంలోని ప్రయాణికుల సంఖ్య, గమ్యస్థానానికి చేరేందుకు తీసుకుంటున్న సమయం తదితర విషయాలపై తితిదే నిర్దిష్టమైన విధానాన్ని అమలుచేయనుందని వివరించారు. ఓవర్‌లోడ్‌ వాహనాల పట్ల యాత్రికులు జాగ్రత్త వహించాలని, ఆర్‌టిసి బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు.

తితిదే తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ భక్తుల భద్రతే పరమావధి అని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రయివేటు ట్యాక్సీలను నియంత్రించనున్నట్టు వెల్లడించారు. కనుమ మార్గంలో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. తిరుమల నుండి బయలుదేరే వాహనాలను మార్గమధ్యంలో మరోసారి తనిఖీ చేయనున్నట్టు చెప్పారు. ప్రమాదాల నివారణపై యాత్రికులకు, వాహనాల డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.