DEATH OF FOMER CHIEF ARCHAKA CONDOLED _ తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీ అర్చకం పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతికి టిటిడి ఛైర్మన్ సంతాపం

Tirumala, 20 Jul. 20: TTD Chairman Sri YV Subba Reddy expressed his deep-felt condolences over the demise of former Chief Archaka of Srivari temple, Sri Peddinti Srinivasamurthy Dikshitulu on Monday.

As per the hereditary traditions of the Srivari temple Archaka families, the temple honors are rendered for the funeral rites of Archaka who is involved in Kainkaryams.

Usually, the funeral materials presented includes one sandalwood stick, fire(Charcoal), a Parivattam (a piece of cloth) which will be carried on a procession from Srivari temple to Bedi Anjaneya temple amidst the melam of one dolu, one Nadaswaram, one Panchamukham (fire lit) along with a person from Potu.

These three materials of sandal stick, parivattam and fire are handed over to the family member of the deceased Archaka at the backside of Sri Bedi Anjaneya for funeral rites.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమల  శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీ అర్చకం పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతికి టిటిడి ఛైర్మన్ సంతాపం
 
తిరుమ‌ల‌, 2020 జూలై 20: తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీ అర్చకం పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి పట్ల టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి సోమవారం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.
 
శ్రీవారి ఆలయంలో వంశపారంపర్య కుటుంబాల నుండి సేవలందిస్తున్న వారు ఎవరైనా పరమపదిస్తే ఆలయ సంప్రదాయం ప్రకారం జరుపవలసిన మర్యాదలు జరుపబడతాయి. ఈ క్రమంలో శ్రీ అర్చకం పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితుల అంత్యక్రియలను ఆలయ మర్యాదలతో నిర్వహిస్తారు. ఇందుకోసం ఒక చందనపు కర్ర, ఒక పరివట్టం, ఒక నిప్పును, ఒక డోలు, ఒక నాదస్వరం, ఒక పంచముఖం, పోటు నుండి ఒక  వ్యక్తి శ్రీవారి ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వెనక వైపునకు తీసుకొస్తారు. అక్కడ శ్రీ అర్చకం పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితులు తరపున వచ్చిన వారికి  వీటిని అందిస్తారు. వీటిని అంత్యక్రియల కోసం వినియోగిస్తారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.