TTD CRIMINAL CASE AGAINST FALSE CAMPAIGNERS IN SOCIAL MEDIA _ టిటిడిపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేసిన వారిపై కేసు

Tirumala, 20 Jul. 20: Over the complaint by the TTD vigilance department,  a criminal case has been registered at Two- town Police Station in Tirumala against the false campaign in social media on Monday.

TTD vigilance had identified two postings on the Hindu-Hindutva page in Facebook, carrying such malafide content both text and caricature charging TTD of non- Hindu religious campaign allegedly with AP government backing.

Contending that such baseless postings were aimed at damaging the sentiments of Srivari devotees and mud slinging on the AP Government,  the senior officials directed the TTD Vigilance department to register a police complaint against the perpetrators of social media.

TTD has also said action will be taken even on those who forward such false, malicious postings to other groups either knowingly or unknowingly also.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడిపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేసిన వారిపై కేసు

తిరుమ‌ల‌, 2020 జూలై 20: తిరుమలలో అన్యమత ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేసిన వారిపై టిటిడి విజిలెన్స్ విభాగం ఫిర్యాదు మేరకు తిరుమల టూ టౌన్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.

ఫేస్ బుక్ లో “హిందూ హిందుత్వం” అనే పేరుతో ఉన్న అకౌంట్ నుండి వచ్చిన ఒక పోస్టింగ్ ను టిటిడి విజిలెన్స్ విభాగం గుర్తించింది. సదరు పోస్టింగ్ లో “స్వామి మిమ్మల్ని తీసేశాడు ఇక దయచేయండి”, “తిరుమలలో అన్యమత వ్యాప్తిని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం” అనే వాక్యాలు, వాటికి అనుగుణంగా చిత్రాలు ఉన్నాయి.

శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, రాష్ట్ర ప్రభుత్వంపై బురదచల్లేలా పూర్తి అసత్యాలను సదరు పోస్టింగులో ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేశారు. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టిటిడి విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విధంగా ఎవరైనా టిటిడికి సంబంధించిన అవాస్తవ సమాచారాన్ని తెలిసో తెలియకో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినా, ఫార్వర్డ్ చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టిటిడి విజిలెన్స్ అధికారులు తెలియజేసారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.