TTD ENSURES PRECAUTIONARY ARRANGEMENTS FOR DEVOTEES AMIDST CYCLONE RAINS _ తుఫాను నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు -టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి
Tirumala, 02 November 2026: The TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary said that comprehensive precautionary measures have been taken to ensure that devotees visiting Tirumala for Srivari Darshan do not face any inconvenience due to rains caused by the cyclonic effect.
Chairing a review meeting with officials of various TTD departments at Sudharma Meeting Hall in Tirumala, on Monday, he directed officials to facilitate speedy darshan, prevent queue lines from extending outside the premises, and ensure uninterrupted Annaprasadam distribution by erecting tarpaulins wherever necessary.
The Additional EO instructed the Engineering and Electrical departments to maintain uninterrupted power supply and remain vigilant in rocks/boulders fall-prone areas along the ghat roads.
He also directed medical staff to remain alert and provide immediate assistance to devotees in the event of slips or injuries caused by rain.
Stressing inter-departmental coordination, he said all wings must work together to ensure the safety and convenience of devotees, enabling smooth darshan and a safe return to their destinations.
TTD Chief Engineer Sri Manoharam, SE 2 Sri Venugopal, Chief Medical Officer Dr. Kusuma Kumari, Annaprasadam Dy EO Sri Rajendra Kumar and others participated in the meeting.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
తుఫాను నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు –టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి
తిరుమల, 2026 నవంబర్ 02: తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అన్నప్రసాదాల పంపిణీకి అంతరాయం లేకుండా, క్యూలైన్లు బయటకు రాకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు.
ఈ మేరకు సోమవారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడంతో పాటు, వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించాలని, సాధ్యమైనంత వరకు క్యూ లైన్లు వెలుపలకు రాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
వర్షాల కారణంగా అన్నప్రసాదాల పంపిణీకి ఎక్కడా అంతరాయం కలగకుండా అవసరమైన ప్రాంతాల్లో టార్పాలిన్లు ఏర్పాటు చేసి భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించాలని సూచించారు. భక్తులు వసతి గదులు, కంపార్ట్మెంట్లలో సురక్షితంగా ఉండేలా తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని విద్యుత్, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఘాట్ రోడ్లలో వర్షాల కారణంగా చిన్న చిన్న రాళ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక అప్రమత్తతతో వ్యవహరించాలని, డౌన్ ఘాట్, అప్ ఘాట్ రోడ్లలో భద్రతా చర్యలు పటిష్టం చేయాలని సూచించారు.
వర్షాల సమయంలో భక్తులు నడిచేటప్పుడు జారిపడి గాయపడే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి, అవసరమైన వారికి తక్షణ వైద్య సహాయం అందించాలని ఆదేశించారు.
అన్ని విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు.
భక్తులందరూ సురక్షితంగా, సులభంగా శ్రీవారి దర్శనం చేసుకుని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ మనోహరం, ఎస్ఇ శ్రీ వేణుగోపాల్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమకుమారి, అన్నప్రసాదం డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.



