BHOOMI PUJA FOR VENGAMAMBA DHYANA MANDIRAM SOON – EO _ త్వ‌ర‌లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావ‌నంలో ధ్యాన‌మందిరంకు త్వరలో భూమి పూజ‌ – టిటిడి ఈఓ.

Tirumala, 10 April 2022:TTD EO Dr KS Jawahar Reddy said Bhumi puja will soon be performed for Vengamamba Dhyana Mandiram coming up at the Brindavan of Matrusri Tarigonda Vengamamba at Tirumala.

Speaking after a visit to the Brindavan along with officials the EO said the TTD Board had resolved to develop the 1.5-acre land in the Brindavan Complex with a Dhyana Mandir and a garden.

Thereafter he extended his warm greetings to Srivari devotees on the occasion of Sri Rama Navami festival.

SE-2 Sri Jagadiswar Reddy, EE-5 Sri Surendra Reddy, DE (electrical) Sri Ravishankar Reddy, VGO Sri Bali Reddy and others were present.

 ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

త్వ‌ర‌లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావ‌నంలో ధ్యాన‌మందిరంకు త్వరలో భూమి పూజ‌ – టిటిడి ఈఓ.
భక్తులకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. ఈఓ

తిరుమ‌ల‌, 2022 ఏప్రిల్ 10: శ్రీవారి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావ‌నంలో ధ్యాన‌మందిరం ఏర్పాటుకు త్వ‌ర‌లో భూమిపూజ చేయ‌నున్న‌ట్లు టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావ‌నాన్ని ఆదివారం ఈవో అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ బృందావ‌నంలో ఉన్న 1. 5 ఎక‌రాల స్థ‌లం అభివృద్ధి చేయాల‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నిర్ణ‌యించింద‌న్నారు. ఇక్క‌డ ధ్యాన‌మందిరం, ఉద్యాన‌వ‌నం ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లో ఇందుకు సంబంధించి భూమి పూజ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఈవో చెప్పారు.

అంత‌కుముందు ఈవో శ్రీ‌వారి భ‌క్తుల‌కు శ్రీ‌రామ‌న‌వ‌మి శుభాకాంక్ష‌లు తెలిపారు. శ్రీ‌రామ‌న‌వ‌మి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌సీతా రామ ల‌క్ష్మ‌ణ స‌మేత ఆంజ‌నేయ‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు స్క‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు. రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు హ‌నుమంత వాహ‌నంపై స్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. అదేవిధంగా రాత్రి 10 నుండి 11 గంట‌ల మ‌ధ్య బంగారు వాకిలి చెంత శ్రీ‌రామ‌న‌వ‌మి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వ‌హిస్తార‌న్నారు.

అంత‌కుముందు తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ బృందావ‌నాన్ని ప‌రిశీలించి, సంబంధిత అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఎస్ఇ- 2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, ఇఇ-5 శ్రీ సురేంద్ర రెడ్డి, డిఇ ( ఎల‌క్ట్రిక‌ల్) శ్రీ ర‌విశంక‌ర్ రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.