TTD SETS RECORD IN BREEDING SAHIWAL THROUGH ONGOLE COW _ దేశంలో తొలిసారిగా పిండ మార్పిడి పద్ధతిలో సాహివాల్ దూడ జననం

EO HAILS DESI COW BREEDING WITH DONORS SUPPORT

NEWBORN SAHIWAL CALF NAMED PADMAVATI

Tirupati,25 June 2023: TTD EO Sri AV Dharma Reddy on Sunday hailed a breakthrough in the breeding of a desi cow with the birth of a Sahiwal breed calf through an Ongole Cow with artificial insemination technology.

Addressing a media conference at SV Goshala on Sunday in Tirupati the TTD EO said the first Sahiwal calf was born through artificial insemination of semen from a Sahiwal breed bovine on Saturday night and named as Padmavati.

He said the  MoU for promoting desi breeds through AI was inked between TTD and AP veterinary university on the suggestion of AP chief secretary Dr KS Jawahar Reddy.

The TTD EO said the milk, curd, ghee and butter from high-breed desi cows are now rolled out for naivedyam, dhoopa & Deepa and Nitya Kainkaryams at the Srivari temple.TTD has already gathered 200 desi breed animals and the effort through breeding is to raise another 300 animals to meet the daily needs of Srivari temple.

He said in order to boost the health and quantity of milk and others products TTD has already set up a feed mixing plant at the Goshala and the target is to raise 3000-4000 litres of quality milk per day to prepare 60 kgs of kg for daily sevas at Srivari temple.

He said as part of TTD agenda to promote Gow-based farming large number of farmers were donating cows to TTD.

Among others, TTD is promoting organic grass cultivation around Tirupati with the support of the district collector to build new sheds and sand dunes in the Goshala for the benefit of animals.

Speaking on the occasion Dr Padmanabha Reddy, VC of the veterinary university said in the next five years 324 Sahiwal breed of cows will be bred in TTD. The gender-based semen will be implanted in the Sahiwal and Gir breed of animals available at the SV Gosala.

TTD JEO Smt Sada Bhargavi, Go Samrakshana Trust member, Sri Ram Sunil Reddy, Go Samrakshanasala Director Dr Harinath Reddy and Dean of veterinary university Sri Veerabrahmamaih and Sri Venkat Naidu were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

దేశంలో తొలిసారిగా పిండ మార్పిడి పద్ధతిలో సాహివాల్ దూడ జననం

– దాతల సహకారంతో దేశావాళీ గోవుల అభివృద్ధి

– సాహి వాల్ దూడకు పద్మావతిగా నామకరణం

– టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి

తిరుపతి, 25 జూన్ 2023: దేశంలో తొలిసారిగా పిండ మార్పిడి (సరోగసి ) పద్ధతిలో ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ జన్మించినట్లు టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఆదివారం ఈవో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సూచనలతో టీటీడీ, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా దేశావాళీ గోజాతులను అభివృద్ధి చేయాలని గత ఏడాది ఎంఓయు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మేలు రకమైన దేశవాళీ గో జాతిని అభివృద్ధి చేసే క్రమంలో ఎస్వీ గో సంరక్షణ శాల లోని మేలు జాతి ఆవుల నుండి అండం సేకరించి, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలోని ఐవిఎఫ్ ల్యాబ్ లో కృత్రిమంగా పిండాలను అభివృద్ధి చేశారన్నారు . వీటిని టీటీడీ గోశాలలోని ఆవులలో ప్రవేశపెట్టి దేశంలోనే తొలిసారిగా విజయం సాధించినట్లు ఈవో తెలిపారు. ఈ ప్రక్రియలో శనివారం రాత్రి ఒంగోలు ఆవుకు జన్మించిన సాహివాల్ దూడకు పద్మావతి అని నామకరణం చేసినట్లు చెప్పారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో ధూప దీప నైవేద్యాలకు, నిత్య కైంకర్యాలకు అవసరమయ్యే పాలు, పెరుగు, వెన్న, నెయ్యిని దేశవాళీ ఆవుపాల నుండి ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు తెలియజేశారు. ఇందుకోసం ఇప్పటికే 200 దేశీయ గోవులను దాతలు సమకూర్చారని, మరో 300 గోవులను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.

ఆవుల ఆరోగ్య పరంగా, అధిక పాల దిగుబడి దిశగా నాణ్యత కలిగిన దాణా తయారీ చేసుకోవడానికి ఇటీవలే గోశాలలో ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ప్రారంభించినట్లు చెప్పారు. అదేవిధంగా గోశాలలో రోజుకు సుమారు 3 వేల నుండి 4 వేల లీటర్ల ఆవు పాలను ఉత్పత్తి చేయనున్నట్లు ఈవో తెలిపారు. రోజుకు 60 కేజీ ల స్వచ్ఛమైన నెయ్యిని సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసి స్వామి వారి నిత్య కైంకర్యం, నైవేద్యాలకు వాడేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.

గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రైతులకు టీటీడీ ఉచితంగా గోవులను అందిస్తోందని అన్నారు.

గోశాలలో ఉన్న షెడ్లలో మార్పులను చేయడం, ఇసుక తిన్నెలను ఏర్పాటు చేసి గోవులకు సహజ సిద్ధమైన వాతావరణాన్ని కల్పించామన్నారు . గోశాలలోనే కాకుండా తిరుపతి పరిసర ప్రాంతాల్లో సేంద్రీయ పద్ధతుల్లో పండించిన పచ్చి మేతను కొనుగోలు చేసేందుకు కలెక్టర్ తో సంప్రదించామన్నారు. రానున్న రోజుల్లో ఇంకా మెరుగైన ఫలితాలు పొందేందుకు వీలుగా నూతన షెడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు.

ఎస్వీ పశు వైద్య విశ్వవిద్యాలయం విసి డాక్టర్ పద్మనాభరెడ్డి మాట్లాడుతూ, రానున్న 5 సంవత్సరాల్లో 324 మేలు రకమైన సాహివాల్ గోజాతి దూడలను ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా పిండ మార్పిడి చేయబడిన ఆవులలో ఇప్పటి వరకు 11 గోవులు గర్భం దాల్చినట్లు తెలిపారు. ఒక ఆవు శనివారం రాత్రి సాహివాల్ పెయ్య దూడకు జన్మనిచ్చిందన్నారు. రానున్న రోజుల్లో ఇంకా 10 సాహివాల్ దూడలు జన్మించనున్నాయని తెలియజేశారు.

ఇదే కాకుండా లింగ నిర్ధారిత వీర్యాన్ని ఎస్వీ గోశాలలో ఉన్న సాహివాల్, గిర్ గోవులలో కృత్రిమ గర్భధారణ ద్వారా ప్రవేశపెడతామన్నారు . దీనివల్ల సరోగసి చెందే ఆవు లక్షణాలు దూడకు రావని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమం ద్వారా మేలు రకమైన దేశీయ జాతి గోవులను రైతులకు సబ్సిడీపై అందించవచ్చని ఆయన వివరించారు.

జేఈవో శ్రీమతి సదా భార్గవి, గో సంరక్షణ ట్రస్ట్ సభ్యులు శ్రీ రామ్ సునీల్ రెడ్డి, గో సంరక్షణ శాల డైరెక్టర్ శ్రీ హరినాథరెడ్డి, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం డీన్ శ్రీ వీర బ్రహ్మయ్య, శ్రీ వెంకట్ నాయుడు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.