KRT BRAHMOTSAVAMS OFF TO A COLOURFUL START _ ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రారంభం

TIRUPATI, 05 APRIL 2024: The annual brahmotsavams in Sri Kodanda Rama Swamy temple in Tirupati commenced on a grand religious note with Dhwajarohanam on Friday.

Under the supervision of Kankanabhattar and Agama Advisor Sri Sitaramacharyulu, the event commenced with the hoisting of Garuda flag atop the temple mast in the auspicious Mesha Laganam between 7.45am and 8.25am amidst chanting of vedic hymns by the Archakas and Pundits.

Earlier, rituals like a procession of Dhwajapatham and Chakrattalwar, Tirumanjanam to the utsava deities etc. were carried out. In the evening, the vahana sevas commences with Pedda Sesha Vahanam between 7pm and 8.30pm.

HH Sri Pedda Jeeyar Swamy of Tirumala, DyEOs Sri Govindarajan, Smt Nagaratna, AEO Sri Parthasaradhi, Superintendent Sri Soma Sekhar, Temple Inspectors Sri Chalapati, Sri Ramesh, Archakas, devotees were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2024 ఏప్రిల్ 05: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

టీటీడీ ఆగ‌మ స‌ల‌హాదారు మ‌రియు కంకణబట్టార్ శ్రీ సీతారామాచార్యులు ఆధ్వ‌ర్యంలో ఉదయం 7.45 నుండి 8.25 గంటల మధ్య మేషలగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల గోవిందనామస్మరణ, రామనామ జపముల మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడంతోపాటు సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుందని అర్చకులు తెలిపారు.

అంతకుముందు ఉదయం 6.30 నుండి 7.45 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారు, ధ్వజపటము, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంత‌రం ఉదయం 8.25 నుండి 9 గంటల వరకు ఆస్థానం నిర్వహించారు.

త‌రువాత‌ ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంల‌తో అభిషేకం చేశారు.

కాగా, రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు పెద్దశేష వాహన సేవ జ‌రుగ‌నుంది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, డెప్యూటీ ఈవోలు శ్రీ గోవింద‌రాజ‌న్‌, శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్‌ శ్రీ సోమ‌శేఖ‌ర్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ సురేష్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.