TTD EO EXTENDS SRI KRODHINAMA TELUGU UGADI TO ALL THE TELUGU DEVOTEES _ శ్రీవారి భక్తులందరికీ శ్రీ క్రోధినామ సంవ‌త్స‌ర‌ ఉగాది శుభాకాంక్షలు

TELUGU CALENDAR FOR THE FIRST TIME BY TTD NEXT WEEK-TTD EO

Tirumala, 05 April 2024:  Extending Sri Krodhinama Telugu Ugadi wishes to all the Telugu devotees spread across the globe, the TTD EO Sri AV Dharma Reddy said, for the first time, TTD has published the Ugadi Telugu calendar which will be available for sales from next week onwards to devotees.

Addressing the monthly Dial your EO programme on Friday at the Meeting Hall in TTD Administrative Building in Tirupati, before taking the phone calls of the devotees, the TTD EO Sri AV Dharma Reddy highlighted the special arrangements made for comfort and convenience of devotees during summer holidays besides special events like Vontimitta Sri Kodandaramaswami temple annual Brahmotsavams and other religious events in various TTD-run temples etc.

The Highlights includes

•  Sri Krodhinama samvatsara Ugadi festival will be celebrated at the  Srivari temple on April 9 with Ugadi Asthanam and Panchanga Shravanam by Vedic Pundits 

•  The TTD Panchangam is now available at TTD information centers at Hyderabad, Visakhapatnam, Vijayawada, Chennai, Bangalore besides Tirumala and Tirupati.

•  The 521th Annamaiah death anniversary fete will be grandly celebrated at the Narayanagiri Gardens on April 5 with Saptagiri Sankeertana Gosti.

•  From April 21-23 TTD is conducting Srivari Salakatla Vasanthotsavam at Vasantha Mandapam in Tirumala. As part of the fete daily Snapana Tirumanjanam will be performed to the utsava deities.

•  On April 22 morning, Sri Malayappaswamy and His consorts will be paraded on Swarna Ratham.

•  Sri Kodandarama Swamy temple Brahmotsavam at Vontimetta will be observed from April 17-25 with the majestic state festival of Sri Sita Rama Kalyanam on April 22.

•  Brahmotsavam of Sri Kodandaramaswamy temples commenced from April 5 in Tirupati.

•  Brahmotsavam of Sri Pattabhirama Swamy temple of Valmikipuram from April 12-20 .

•  Annual Brahmotsavam of Chandragiri Sri Kodandaramaswamy Temple from April 17-25.

•  TTD has made elaborate arrangements at Tirumala anticipating the heavy pilgrim rush following summer vacation in the next three months.

•  The Honourable Chief Justice of India lauded TTD’s Manuscripts Digitisation Project during his recent visit to the SV Vedic University on March 27 and called for a National Mission to preserve, protect and promote the ancient manuscripts in palm leaves, copper plates etc. to empower ancient knowledge in Jyothisha, Nyaya Shastra, Vignana, Vaidya and many other areas for the sake of future generations.

JEO Sri Veerabrahmam, CEO SVBC Sri Shanmukh Kumar and other officers were also present.

ISSUED BY CPRO TTD TIRUPATIpril 13, the event concludes with Dhwajavarohanam. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి భక్తులందరికీ శ్రీ క్రోధినామ సంవ‌త్స‌ర‌ ఉగాది శుభాకాంక్షలు

– టీటీడీ ఆధ్వ‌ర్యంలో మొట్ట‌మొద‌టిసారిగా తెలుగు క్యాలెండర్

– ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమ‌ల‌, 2024 ఏప్రిల్ 05: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భక్తులందరికీ శ్రీ క్రోధినామ సంవ‌త్స‌ర‌ ఉగాది శుభాకాంక్షలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలియజేశారు. మొట్ట‌మొద‌టిసారిగా ఉగాది తెలుగు క్యాలెండర్‌ను టీటీడీ ప్రచురించిందని, వచ్చే వారం నుంచి భ‌క్తుల‌కు అందుబాటులోకి రానున్నాయని ఈవో తెలిపారు.

తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని మీటింగ్ హాల్‌లో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఉగాది శుభాకాంక్షలు :

•⁠ ⁠శ్రీవారి భక్తులకు, దాతలకు, అర్చకులకు, టిటిడి సిబ్బందికి, శ్రీవారి సేవకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

•⁠ ⁠ఏప్రిల్‌ 9వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తాం. ఈ సందర్భంగా టిటిడి ఆస్థాన పండితులు ఆస్థానం, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఇందులో దేశకాల, ఋతు పరిస్థితులను, నక్షత్ర, రాశి, వారఫలాలను పండితులు తెలియజేస్తారు.

శ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగం :

•⁠ ⁠శ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగాన్ని భక్తులందరూ కొనుగోలు చేసేందుకు వీలుగా ఇప్పటికే తిరుమల, తిరుపతిలోని టిటిడి బుక్‌స్టాళ్లలో అందుబాటులో ఉంచాం.

•⁠ ⁠హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, బెంగళూరులోని టిటిడి సమాచార కేంద్రాల్లోనూ పంచాంగం అందుబాటులో ఉంది.

ఏప్రిల్‌ 5న తిరుమలలో శ్రీ అన్నమయ్య 521వ వర్థంతి

•⁠ ⁠శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యల 521వ వర్థంతి మహొత్సవం ఏప్రిల్‌ 5న సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాల్లో ఘనంగా నిర్వహిస్తాం.

ఏప్రిల్‌ 21 నుండి 23వ తేది వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు :

•⁠ ⁠ఈ నెల 21 నుండి 23వ తేది వరకు తిరుమలలోని వసంత మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాము.

•⁠ ⁠ఇందులో భాగంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.

•⁠ ⁠ఏప్రిల్‌ 22వ తేదీ ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామి, అమ్మవార్లు స్వర్ణరథంపై ఊరేగి భక్తులకు దర్శనం ఇస్తారు.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాలు :

•⁠ ⁠టిటిడికి అనుబంధంగా ఉన్న పురాతనమైన ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం.

•⁠ ⁠ఏప్రిల్‌ 22వ తేదీన శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం.

•⁠ ⁠భక్తులు విచ్చేసి బ్రహ్మోత్సవాల వైభవాన్ని తిలకించాలని కోరుతున్నాం.

టిటిడి స్థానిక ఆలయాలలో బ్రహ్మోత్సవాలు :

•⁠ ⁠ఈ రోజు నుండి 13వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు,

•⁠ ⁠ఏప్రిల్‌ 12 నుండి 20వ తేదీ వరకు వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు,

•⁠ ⁠ఏప్రిల్‌ 17 నుండి 25వ తేదీ వరకు చంద్రగిరిలోని శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

టిటిడిని అభినందించిన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

•⁠ ⁠భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డాక్టర్‌ డివై చంద్రచూడ్‌ గారు మార్చి 27వ తేదీన ఎస్వీ వేద విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. అత్యంత పురాతనమైన తాళపత్ర గ్రంథాలను ఇక్కడ డిజిటలైజ్‌ చేసి భద్ర పరుస్తున్న విధానాన్ని ఆయన అభినందించారు. భావితరాలకు సనాతన భారతీయ విజ్ఞానాన్ని అందించేందుకు తాళపత్రాలలోని విజ్ఞానాన్ని ప్రచురించడానికి టిటిడి చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, ఎస్వీబిసి సిఈవో శ్రీ ష‌ణ్ముఖ‌కుమార్‌, సిఈ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్‌ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.