GT ANNUAL FETE CONCLUDES _ ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలు 

TIRUPATI, 03 JUNE 2033: The annual Navahnika Brahmotsavams concluded with Dhwajavarohanam on Saturday night in Sri Govindaraja Swamy temple in a grand religious manner.

Both the seers of Tirumala, Kankana Bhattar Sri Srinivasa Deekshitulu, DyEO Smt Shanti and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2023 జూన్ 03: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.

రాత్రి 8.40 గంటల నుండి ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు.

బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, కంకణ భట్టర్ శ్రీ ఏపీ శ్రీనివాస దీక్షితులు, డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈఓ శ్రీ రవికుమార్, సూపరింటెండెంట్
శ్రీ నారాయణ, టెంపుల్స్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయలు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.