PADMAVATHI BLESSES ON TEPPA _ తెప్పపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం

TIRUPATI, 03 JUNE 2023: The annual Teppotsavams in Tiruchanoor witnessed Goddess Sri Padmavathi Devi taking a celestial ride on the finely decked float in three rounds on Saturday evening.

The processional deity of Sri Padmavathi Devi blessed Her devotees on the float between 6:30pm and 7:30pm  gliding in the spacious Padma Sarovaram.

AEO Sri Ramesh, Superintendent Sri Seshagiri and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

తెప్పపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం

తిరుపతి, 2023 జూన్‌ 03: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో శనివారం శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించి భక్తులను కటాక్షించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు పద్మ పుష్కరిణి వద్ద గల నీరాడ మండపంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.

సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో అమ్మవారు ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు.
అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు గజవాహనం పై కొలువుదీరి నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.

ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీ శేషగిరి, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సుభాష్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.