ANKURARPANAM ON NOV 10 _ న‌వంబ‌రు 10న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌

న‌వంబ‌రు 10న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌

ఉద‌యం ఆన్‌లైన్‌ ల‌క్షకుంకుమార్చ‌న‌

తిరుపతి, 2020 నవంబరు 09: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 11 నుండి 19వ తేదీ వరకు ఏకాంతంగా జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలకు న‌వంబ‌రు 10వ తేదీ మంగ‌ళ‌వారం  అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా ఉద‌యం 8 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్ ల‌క్ష‌కుంకుమార్చ‌న నిర్వ‌హిస్తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల న‌డుమ పుణ్యా‌హ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, సేనాధిప‌తి ఉత్స‌వం, యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.

న‌వంబ‌రు 11న ధ్వ‌జారోహ‌ణం :

ఆలయంలో న‌వంబ‌రు 11న బుధ‌వారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ధ్వజస్థంభ తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.30 నుండి 9.47 గంటల నడుమ ధ‌నుర్ల‌గ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు చిన్నశేష వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

వాహనసేవల వివరాలు :

తేదీ                                     ఉదయం                                       రాత్రి

11-11-2020(బుధ‌వారం)      ధ్వజారోహణం – చిన్నశేషవాహనం

12-11-2020(గురువారం)     పెద్దశేషవాహనం – హంసవాహనం

13-11-2020(శుక్ర‌వారం)   ముత్యపుపందిరి వాహనం –  సింహవాహనం

14-11-2020(శ‌నివారం)        కల్పవృక్ష వాహనం – హనుమంతవాహనం

15-11-2020(ఆదివారం)          పల్లకీ ఉత్సవం – వ‌సంతోత్స‌వం, గజవాహనం

16-11-2020(సోమ‌వారం)     సర్వభూపాలవాహనం – స్వర్ణరథం(స‌ర్వ‌భూపాల వాహ‌నం), గరుడవాహనం

17-11-2020(మంగ‌ళ‌వారం)     సూర్యప్రభ వాహనం  – చంద్రప్రభ వాహనం

18-11-2020(బుధ‌వారం)        రథోత్సవం(స‌ర్వ‌భూపాల వాహ‌నం) – అశ్వ వాహనం

19-11-2020(గురువారం)      పంచమితీర్థం(వాహ‌న‌మండ‌పంలో)  – ధ్వజావరోహణం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirupati, 9 Nov. 20: The annual Karthika Brahmotsavams of Goddess Sri Padmavathi Devi will commence from November 11 onwards with Ankurapanam on November 10.

In view of Covid, TTD is observing the mega religious fete also in Ekantam akin to Tirumala Brahmotsavams.

LAKSHA KUMKUMARCHANA

For the benefit of devout, TTD is performing Laksha Kumkumarchana on virtual platform on Tuesday between 8am and 12noon.

EVENING FETE

In the evening, Punyahavachanam, Rakshabandhanam, Senadhipathi Utsavam,

Ankurarpanam will be performed in Yagashala between 6:30pm and 8:30pm.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI