SRI SOMASKANDAMURTHY ON PURUSHA MRUGHA VAHANAM _ పురుషామృగ‌ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి

Tirumala, 09 March 2024: On the ninth day of the ongoing annual Brahmotsavam in Sri Kapileswara Swamy temple in Tirupati on Saturday morning, Sri Somaskandamurthy along with Sri Kamakshi Devi blessed devotees on Purusha Mrugha Vahanam. 

Vahanaseva took place in the city streets in the midst of bhajan mandal kolatams, bhajans and mangal instruments.  

Lingodbhavakala Abhishekam was performed from 12 midnight to 4 am. Sarvadarshan for devotees started from 7.30 am.  Snapana Tirumanjanam was conducted from 10 am onwards. 

On this occasion, Sri Somaskandamurthy and Sri Kamakshi Devi were rendered Snapanam with milk, curd, honey, coconut water, turmeric, sandalwood, Paneer and Vibhudi.

Temple Deputy EO Sri Devendra Babu, AEO Sri Subbaraju, Superintendent Sri Bhupathi, Temple Inspectors Sri Ravikumar, Sri Balakrishna and devotees participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

 

పురుషామృగ‌ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి

తిరుప‌తి, 2024, మార్చి 09: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజైన శనివారం ఉదయం కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తి పురుషామృగ వాహనంపై అనుగ్రహించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు.

కాగా అర్ధరాత్రి 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహించారు. ఉదయం సుప్రభాతం అనంతరం అభిషేకం చేశారు. ఉదయం 7.30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. ఉద‌యం 10 గంటల నుండి స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధం, ప‌న్నీరు, విభూదితో స్నపనం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.