TIRUMALA SRIVARI SALAKATLA THEPPOTSAVAM FROM 20TH TO 24TH MARCH _ మార్చి 20 నుండి 24వ తేదీ వరకు తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు

Tirumala, 09 March 2024: Srivari Salakatla Teppotsavams will be held from March 20-24:in Tirumala between 7pm and 8 pm everyday in Swamy Pushkarini.

On the first day of the Raft Festival, on March 20, Sri Ramachandramurthy along with Sri Sita Lakshmana Anjaneya will parade three rounds on the float in Pushkarini and bless the devotees. 

On the second day, on March 21, Sri Krishna Swamy along with Rukmini will take a trip on the rafts three times.

On the third day, March 22, Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi blesses the devotees by wrapping them in Pushkarini three times. 

Similarly, Sri Malayappa Swamy will visit the devotees five times on the fourth day on March 23 and seven times on the last day on March 24.

TTD has cancelled Sahasra Deepalankara Seva on March 20 and 21, Arjita Brahmotsavam and Sahasra Deepalankara services on March 22, 23 and 24.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మార్చి 20 నుండి 24వ తేదీ వరకు తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు

తిరుమల, 09 మార్చి 2024: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 20 నుండి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 20న శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. రెండవ రోజు మార్చి 21న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై మూడుసార్లు విహరిస్తారు.

మూడవరోజు మార్చి 22న శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదేవిధంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగో రోజు మార్చి 23న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 24వ తేదీ ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.

ఆర్జిత సేవలు రద్దు :

తెప్పోత్సవాల కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 22, 23, 24వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.