GLORY OF SRI KODANDARAMA ON PEDDASESHA VEHICLE _ పెద్దశేష వాహనంపై శ్రీ కోదండరాముడి వైభవం

Tirupati, 05 April 2024: As part of the ongoing annual Brahmotsavam in Sri Kodandarama Swamy temple in Tirupati, Pedda Sesha Vahanam was observed on Friday evening.

Sri Sita Lakshmana along with Sri Ramachandra Murthy entertained the devotees with their divine presence on the seven-hood serpent king carrier.

While the pachyderms were moving in front, and groups of devotees presenting colourful kolatams, the Vahanaseva of the Lord paraded majestically amidst the music of mangal Vaidyams.

In this program HH Sri Sri Pedda Jeeyar Swamy and HH Sri Sri Sri Chinna Jeeyar Swamy of Tirumala, Deputy EOs Sri Govindarajan, Smt. Nagaratna, AEO Sri. Parthasaradhi, Superintendent Sri. Somasekhar, Temple Inspectors Sri. Chalapathy, Sri. Suresh and temple priests were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పెద్దశేష వాహనంపై శ్రీ కోదండరాముడి వైభవం

తిరుపతి, 2024 ఏప్రిల్ 05: తిరుపతి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శుక్ర‌వారం రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి భక్తులకు కనువిందు చేశారు.

గజరాజులు ముందు కదులుతుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

శేష వాహ‌పంపై స్వామివారిని దర్శించే భక్తుల్ని కాపాడుతానని, భక్తులు శేషుని వలే తనకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు అనుగ్రహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి,
డెప్యూటీ ఈవోలు శ్రీ గోవింద‌రాజ‌న్‌, శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్‌ శ్రీ సోమ‌శేఖ‌ర్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ సురేష్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.