DINAMU DWADASI OBERVED _ అన్నమయ్య సంకీర్తన‌ల‌తో పులకించిన నారాయణగిరి

Tirumala, 05 April 2024:  In connection with the 521st Tallapaka Annamacharya Vardhanti, Saptagiri Sankeertana Gosti Ganam were rendered with utmost devotional fervour coupled with Anugraha Bhashanam by HH Srivan Satagopa Yateendra 

Mahadesikan, the 46th Pontiff of Ahobilam Mutt at Narayanagiri Gardens in Tirumala on Friday evening.

At the beginning of the program, Lakshmi Nrisimha Mala was offered to the first disciple of Ahobila Mutt, Sri Tallapaka Annamacharya idol.

Saptagiri Sankeertans by Annamacharya Project artists were rendered in a melodious manner in front of Sri Malayappa, Sridevi and Bhudevi.

The Sankeertans included Dinamu Dwadasi Nedu..Bhavamulona…

Brahma kadigina Paadamu…

Enta matramuna Evvaru Talachina…

Podagantimayya mimmu Purushottama

..Kondalalo Nelakonna Konetirayudu vaadu…

Narayanate Namo Namo… Muddugare Yasodha…

In his Anugraha Bhashanam the Ahobilam Pontiff said, TTD has been observing Annamacharya Vardhanti fete in a grand manner since many years

and he has been Plparticipating from the past 15 years in the soulful program.

He said, Annamacharya penned 32000 Shringara, Yoga, Bhakti Sankeertans as he was taught 32 Beejakshara Mantram by Ahobila Seer. These Sankeertans penned by Annamacharya are Na Bhuto Na Bhavishyati. 

He wished TTD should prepare more and artists and Vidhwans to take forward the legacy of Annamaiah Sankeertans.

He also said there is a unique bond between Tirumala and Ahobila Kshetras as Sri Venkateswara Himself prayed Ahobila Narasimha seeking His blessings before he tied the nuptial knot to Sri Padmavati Devi.

Later Garuda Puranam 1 and 2 first copy were presented to Ahobila Mutt Pontiff as Pustaka Prasadam by TTD EO Sri AV Dharma Reddy along with Srivari Prasadams.

The Pontiff also offered blessings to EO, Tallapka descendants, Annamacharya Project Director Dr Vibhishana Sharma, artists, devotees on the occasion.

Estates Officer and Prakamani DyEO Sri Mallikharjuna, Health Officer Dr Sridevi, Peishkar Sri Srihari, AVSOs Sri Manohar, Sri Vishwanath and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అన్నమయ్య సంకీర్తన‌ల‌తో పులకించిన నారాయణగిరి

•⁠ ⁠తిరుమలలో ఘనంగా అన్నమయ్య వర్ధంతి

తిరుమల, 2024 ఏప్రిల్ 05: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో శుక్రవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఊంజల్‌సేవలో నిర్వహించిన సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంతో సప్తగిరిలు పులకించాయి.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీమాన్‌ శ్రీవణ్‌ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామిజీ అనుగ్రహభాషణం చేశారు. అన్నమయ్యకు, వారి ఆచార్యపీఠమైన అహోబిల మఠానికి ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. అన్నమయ్య విద్యాభ్యాసం, వేదశాస్త్రాల అధ్యయనం ఇక్కడే సాగిందని చెప్పారు. అహోబిలం శ్రీ నరసింహస్వామివారి అనుగ్రహంతో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు దీక్ష పొంది మంత్రోపదేశం పొందారని వివరించారు. ఈ మంత్రోపదేశంలోని 32 బీజాక్షరాలతో అన్నమయ్య 32 వేల సంకీర్తనలు రచించారన్నారు. గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం శ్రీవారి అనుగ్రహం అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా టీటీడీ అన్నమయ్య జయంతి, వర్ధంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్నమయ్య సంకీర్తనలను జన బహుళయంలోకి తీసుకువెళ్లడానికి మరింత మంది యువ కళాకారులు కృషి చేయాలని స్వామీజీ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా స్వామీజీకి గరుడ పురాణం 1 మరియు 2 పుస్తక ప్రసాదాన్ని ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి అందించారు. తరువాత స్వామీజీకి శ్రీవారి ప్రసాదాలు ఈవో అందజేశారు.

అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు డా. ఆకెళ్ల విభీషణ శ‌ర్మ మాట్లాడుతూ సంకీర్తనలతో శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతి మహోత్సవాలను తిరుమలలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ముందుగా దినము ద్వాదశి, సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంలో భాగంగా ”దినము ద్వాదశి నేడు…, భావములోన బాహ్యము నందును…., బ్రహ్మ కడిగిన పాదము…, ఎంత మాత్రమున ఎవ్వరు దలిచిన…., పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా…., కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు…., నారాయణతే నమో నమో…., ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు…., ” కీర్తనలను కళాకారులు రసరమ్యంగా గానం చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్టేట్ అధికారి శ్రీ మల్లికార్జున, హెల్త్ అధికారి డా.శ్రీదేవి, పేష్కార్ శ్రీ శ్రీహరి, ఏవిఎస్ఓలు శ్రీ మనోహర్, శ్రీ విశ్వనాథ్,
ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.