SPECIAL FESTIVALS AT SRI KODANDARAMA SWAMY TEMPLE IN FEBRUARY _ ఫిబ్రవరిలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, 28 January 2024:TTD is organising several special festivals at Sri Kodandarama Swamy temple in the month of February.

The following are details:

* February 3,10,17,24 – all Saturdays Abhisekam for main idols of Sri Sitaramaa and Lakshmana in the morning and Unjal Seva, Tiruveedhi Utsavam and Asthanam in the evening.

 February 9: On the occasion of  Amavasya, Sahasra Kalashabisekam in the morning and Hanumanta Vahana Seva at night.

* February 21: On Punarvasu Nakshatram Sri Sitarama Kalyanam and Procession of Swamy and Ammavaru utsava idols up to Sri Ramachandra Pushkarani, Unjal Seva and  Asthanam in the evening.

* February 25: Kupchandrapeta Utsava on Pournami day.

 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఫిబ్రవరిలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2024 జనవరి 28: తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో ఫిబ్రవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– ఫిబ్రవరిలో 3, 10, 17, 24వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఊంజల్‌సేవ, తిరువీధి ఉత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు.

– ఫిబ్రవరి 9న అమావాస్య సందర్భంగా ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.

– ఫిబ్రవరి 21వ తేదీ పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 5.30 గంటలకు ఊంజల్‌సేవ, ఆస్థానం నిర్వహిస్తారు.

– ఫిబ్రవరి 25న పౌర్ణమి సందర్భంగా కూపుచంద్ర పేట ఉత్సవం నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.