SRI PURANDHARA DASA ARADHANA MAHOTSAVAM FROM FEB 8 TO 10 _ ఫిబ్ర‌వరి 8 నుండి 10వ తేదీ వరకు తిరుమలలో శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు

SRI VENKATESWARA NAVARATNA MALIKA FETE ON FEB 7

 

YUVA PRATIBHA AWARDS TO ARTISTS

 

Tirumala, 28 January 2024: TTD is organising the Sri Purandhara Dasa Aradhana Mahotsavam of Carnatic sangeet patriarch Sri Purandhara Dasa from February 8 to 10 at Asthana mandapam in Tirumala.

 

On the first day, the collective Nagara Sankeertana programs and Purandhara Sahitya Gosti will be held.

 

On the second day on February 9, the statue of Sri Purandhara Dasa at Alipiri will be Garlanded.

 

Procession of the Srivari utsava idol from Srivari temple to Narayangiri Gardens and unjal seva, Dasa sankeernata will be held in the evening.

 

Among others on February 10 Nagara Sankeertana, bhajana and Hari dasa Rasamanjari programs will be observed.

 

Besides, the Sri Venkateshwara Navaratna Malika fete will be observed on February 7.

 

On the same day, for the first time, young artists in music, dance and instrumental fields will be presented awards by TTD.

 

Dasa Sahitya project Special Officer Sri Ananda Theerthacharyulu is supervising all the arrangements.

 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఫిబ్ర‌వరి 8 నుండి 10వ తేదీ వరకు తిరుమలలో శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు

– ఫిబ్ర‌వ‌రి 7న తిరుమ‌ల‌లో “శ్రీ వేంక‌టేశ్వ‌ర న‌వ‌ర‌త్న మాలిక‌”

– క‌ళాకారుల‌కు “యువ ప్ర‌తిభ పుర‌స్కారాలు”

తిరుమల, 2024 జ‌న‌వ‌రి 28: కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు టీటీడీ దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్ర‌వరి 8 నుంచి 10వ తేదీ వరకు తిరుమల ఆస్థాన మండ‌పంలో ఘ‌నంగా జరుగనున్నాయి.

మొదటిరోజైన ఫిబ్ర‌వరి 8న ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగరసంకీర్తన కార్యక్రమాలు, పురంద‌ర సాహిత్య‌ గోష్ఠి, వివిధ పీఠాధిపతుల మంగళాశాసనాలు, మధ్యాహ్నం సంకీర్తనమాల కార్యక్రమాలు నిర్వహిస్తారు.

రెండవ రోజైన ఫిబ్ర‌వరి 9న ఉదయం 6 గంటలకు అలిపిరి చెంత పురందరదాసుల విగ్రహానికి పుష్పమాల సమర్పిస్తారు. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి ఆలయం నుండి నారాయణగిరి ఉద్యానవనం వరకు శ్రీవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు, ఊంజల్‌సేవ, దాససంకీర్తన కార్యక్రమాలు ఉంటాయి.

చివరిరోజు ఫిబ్ర‌వరి 10న ఉదయం సుప్ర‌భాతం, ధ్యానం, సామూహిక భ‌జ‌న‌, న‌గ‌ర సంకీర్త‌న, హరిదాస రసరంజని కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఫిబ్ర‌వ‌రి 7న “శ్రీ వేంక‌టేశ్వ‌ర న‌వ‌ర‌త్న మాలిక‌”

ఫిబ్ర‌వ‌రి 7న తిరుమలలోని కల్యాణవేదికలో యువ కళాకారులతో “శ్రీ వేంక‌టేశ్వ‌ర న‌వ‌ర‌త్న మాలిక” గోష్టిగానం నిర్వ‌హించ‌నున్నారు.

క‌ళాకారుల‌కు “యువ ప్ర‌తిభ పుర‌స్కారాలు”

సంగీత‌, నృత్య, వాద్య‌ రంగాల‌లో నిష్ణాతులైన యువ క‌ళాకారుల‌కు ఈ ఏడాది మొద‌టిసారిగా టీటీడీ దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో “యువ ప్ర‌తిభ పుర‌స్కారాలు” అంద‌జేస్తారు.

ఈ కార్యక్రమాల ఏర్పాట్ల‌ను టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు పర్యవేక్షిస్తున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.