VIP BREAK DARSHAN LIMITED TO PROTOCOL ON FEB 11 AND 12_ ఫిబ్రవరి 11, 12వ తేదీల్లో ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే విఐపి బ్రేక్‌ దర్శనాలు

VIP BREAK DARSHAN LIMITED TO PROTOCOL ON FEB 11 AND 12

Tirumala, 5 Feb. 19: In view of Radhasapthami on February 12, the VIP break darshan will be given to only protocol VIPs on February 11 and 12.

TTD has also cancelled all other privilege darshans through supatham entry including senior citizens, physically challenged, parents with infants below one year old, donors on February 12 anticipating heavy pilgrim rush for the big fete.

All arjitha sevas were also cancelled on the day of Radhasapthami.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

ఫిబ్రవరి 11, 12వ తేదీల్లో ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే విఐపి బ్రేక్‌ దర్శనాలు

తిరుమల, 05 ఫిబ్రవరి 2019: తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 12న రథసప్తమి పర్వదినం సందర్భంగా సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 11, 12వ తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాలను ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే టిటిడి పరిమితం చేసింది.

అదేవిధంగా, ఫిబ్రవరి 12న చంటిపిల్లల తల్లిదండ్రులకు, వయోదృద్ధులు, దివ్యాంగులకు, దాతలకు సుపథం మార్గంలో కల్పించే ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది.

కాగా, ఫిబ్రవరి 12న రథసప్తమినాడు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన అష్టదళపాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.