TTD EMPLOYEES ANNUAL SPORTS FROM FEBRUARY 2 _ ఫిబ్ర‌వ‌రి 2 నుండి టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు

Tirupati, 31 January 2020: TTD employees annual sports meet-2020 will be inaugurated on February 2 at the parade grounds of TTD administrative buildings at 10am.

During the inaugural event the details of the program like participants, teams, schedule of sports events will be declared.

TTD is organising separate events for Men and Women employees and events includes Tug-of-war, chess, volleyball, caroms, ball Badminton, football, table tennis, cricket shuttle tennis and other sports.

TTD has appealed to all the employees to participate in the events and make the program a grand success .

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

ఫిబ్ర‌వ‌రి 2 నుండి టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు

 జనవరి 31, తిరుపతి 2020:  టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు-2020 ప్రారంభోత్సవం ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు తిరుపతిలోని పరిపాలనా భవనంలో గల పరేడ్‌ మైదానంలో జరుగనుంది. ఈ పోటీలు ఫిబ్రవరి 16వ తేదీ వరకు జరుగనున్నాయి.

ప్రారంభ కార్యక్రమంలో క్రీడల్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న ఉద్యోగుల పేర్లు, టీమ్‌లు, పోటీ షెడ్యూల్‌ తదితర వివరాలు తెలియజేయడం జరుగుతుంది. పురుషులకు, మహిళలకు వేరువేరుగా పోటీలు నిర్వహిస్తారు. ఇందులో టగ్‌ ఆఫ్‌ వార్‌, చెస్‌, వాలీబాల్‌, క్యారమ్స్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌, క్రికెట్‌, షటిల్‌, టెన్నిస్‌ తదితర క్రీడలు ఉన్నాయి. ఉద్యోగులందరూ పాల్గొని ప్రారంభ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోర‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.