SRIVARI SEVAKULU ARE A SUPPORTING ARM TO TTD-EO _ శ్రీవారి సేవకుల స‌హ‌కారంతో భ‌క్తుల‌కు విశేష సేవ‌లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

Tirumala, 31 January 2020: While complimenting the impeccable services of Srivari Sevakulu to the multitude of visiting pilgrims to Tirumala, TTD EO Anil Kumar Singhal described Srivari Seva as a “Supporting Arm” to TTD.

Addressing 3500 Srivari Sevakulu at Asthana Mandapam in Tirumala on Friday, who have come to render services to the pilgrims on the occasion of Radhaspathami which is scheduled on February 1, the EO said, Srivari Sevakulu have offered dedicated services during Garuda Seva last year and Vaikuntha Ekadasi on January 6. “When compared to these two challenging festivities, the pressure will be less during Radhaspathami. However, we all should be alert in discharging our respective responsibilities”, he observed.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

శ్రీవారి సేవకుల స‌హ‌కారంతో భ‌క్తుల‌కు విశేష సేవ‌లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

తిరుమల, 2020 జనవరి 31: తిరుమ‌ల శ్రీ వారి ద‌ర్శ‌నానికి ప్ర‌తి రోజు విచ్చేసే ల‌క్ష‌లాది భ‌క్తుల‌కు విశేష‌ సేవ‌లందిస్తున్న‌ శ్రీ‌వారి సేవ‌కుల స‌హ‌కారంతో టిటిడి మ‌రిన్ని సేవ‌లందిస్తున్న‌ద‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఉద్ఘాటించారు. ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని టిటిడి ఈవో, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి శుక్ర‌వారం ఉదయం తిరుమలలోని ఆస్థానమండపంలో శ్రీవారి సేవకులకు ఆలయ నాలుగు మాడ వీధులలో భక్తులకు అందించవలసిన సేవలను వివరించారు.


ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రథసప్తమి పర్వదినాన శ్రీవారు సప్తవాహనాలపై దర్శనమిస్తారు కావున అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు విచ్చేస్తారని తెలిపారు. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌లో గ‌రుడ‌సేవ‌నాడు విచ్చేసే ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు, వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినాన దాదాపు 30 గంట‌ల పాటు నిరంత‌రాయంగా శ్రీ‌వారి సేవ‌కులు సేవ‌లందించార‌ని అభినందించారు. ఇదే స్ఫూర్తితో ర‌థ‌స‌ప్త‌మినాడు గ్యాలరీల్లోని ప్ర‌తి  భ‌క్తునికి సమయానుకూలంగా టి, కాఫి, అల్పాహారం, మ‌జ్జిగ‌, అన్నప్రసాదాలు అందేలా చూడాలన్నారు. గ్యాల‌రీల్లో భక్తుల సౌక‌ర్యాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు టిటిడి అధికారులకు, సిబ్బందికి నాలుగు మాడ వీధులలో విధులు కేటాయించినట్లు తెలిపారు. ప్ర‌తి గ్యాల‌రీలో టిటిడి సిబ్బందితోపాటు పారిశుద్ధ్య‌ సిబ్బంది, శ్రీ‌వారి సేవ‌కులు ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. స్వామివారు క‌ల్పించిన ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని శ్రీవారి సేవకులు భక్తి భావంతో, సేవాదృక్పధంతో, శ్రద్ధ‌తో సేవలందిలని కొరారు.  వాహనసేవల సమయంలో గ్యాలరీల్లోని భక్తులు సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకునేలా, భక్తులతో గౌరవప్రదంగా నడుచుకోవాలన్నారు.
   
నేడు శ్రీ‌వారి సేవ‌కులు తిరుమ‌ల‌లోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, అన్న‌ప్ర‌సాదం, ల‌డ్డూ కౌట‌ర్లు, గో సంర‌క్ష‌ణ‌శాల త‌దిత‌ర టిటిడిలోని అన్ని విభాగాల‌లో సేవ‌లందిస్తున్నార‌న్నారు. నూత‌న శ్రీ‌వారి సేవా స‌ద‌నాలు రూ .98 కోట్ల‌తో నిర్మించి అన్ని సౌక‌ర్యాలు ఏర్పాటు చేసిన‌న‌ట్లు తెలిపారు. శ్రీ‌వారి సేవ‌కులు తిరుమ‌ల‌లోనే కాకుండా త‌మ‌త‌మ ప్రాంతాల‌లో హిందూ ధ‌ర్మ ప్ర‌చారానికి కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు.

టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారి డా. టి.ర‌వి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ కార్యక్రమంలో  ఏపిఆర్వో కుమారి పి.నీలిమ‌, ఏఇ శ్రీ వ‌ర‌ప్ర‌సాద్‌, ఓఎస్‌డిలు శ్రీ ఫ‌ణిరంగ‌సాయి, శ్రీ శ్రీ‌ధ‌ర్‌  ఇత‌ర అధికారులు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, ఓడిశా రాష్ట్రాల నుండి విచ్చేసిన 3500 మంది శ్రీ‌వారి సేవ‌కులు పాల్గొన్నారు.                                          

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.