PHULE JAYANTI OBSERVED _ బడుగుల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే  

Tirupati, 11 April 2024: TTD has observed the 197th Birth Anniversary of one of the great Social Reformers of 19th Century, Mahatma Jyotirao Govindrao Phule in Mahati Auditorium on Thursday.

DyEOs Sri Govindarajan, Sri Devendra Babu, Smt Snehalata recalled the great works of Phule in many fields. 

They said, his contributions included getting rid of untouchability and the caste system, encouraging women education and pioneered the same by making his wife Savitribai Phule to become the first teacher in India.

Later a few TTD employees also expressed their views on the impeccable efforts made by Mahatma Phule who formed the Satyashodhak Samaj (Society of Truth Seekers) with a goal to get equal rights for people from lower castes. It worked for the betterment of the oppressed classes. Mahatma Phule stood as inspiration to many other social reformers in the country including the Architect of Indian Constitution Dr BR Ambedkar.

Many officials and employees were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

బడుగుల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే  
 
– టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా పూలే జయంతి ఉత్సవాలు
 
తిరుపతి, 2024 ఏప్రిల్‌  11: బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే అని  టీటీడీ ఉద్యోగులు అభివర్ణించారు. మ‌హాత్మ జ్యోతిబా పూలే 197వ జ‌యంతి ఉత్స‌వం గురువారం తిరుప‌తిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో ఘ‌నంగా జ‌రిగింది.
 
ఈ సందర్భంగా శ్రీ రామచంద్ర, శ్రీ శివకుమార్, శ్రీమతి ఇందిర, శ్రీ రాజ్ కుమార్, శ్రీ పెరుమాళ్, శ్రీ మునీంద్ర, శ్రీ కిరణ్, పలువురు యూనియన్ నాయకులు ప్రసంగిస్తూ….
 
మహారాష్ట్రలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన జ్యోతిబాఫూలే వర్ణ వ్యవస్థతో కునారిల్లుతున్న సమాజానికి సంస్కారం నేర్పారని కొనియాడారు. అణగారిన వర్గాల ఎదుగుదలకు విద్య సరైన ఆయుధమని భావించి పాఠశాలలు నెలకొల్పారని, స్త్రీ విద్యను ప్రోత్సహించారని, బాల్య వివాహలను వ్యతిరేకించి, వితంతు పునర్వివాహానికి నాంది పలికారని వివరించారు. అన్ని వర్గాల వారికి విద్య, ఉపాధి, రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేశారని చెప్పారు. బడుగుల అభ్యున్నతికి కృషిచేసిన జాతీయ నాయకులు, సంఘ సంస్కర్తల జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, వారి ఆశయాలను భావితరాలకు అందించేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు.
 
వెనకబాటు, కులతత్వం తదితర అనేక కారణాల వల్ల భారతీయ సమాజం ఇతర సమాజాల కంటే సంక్లిష్టమైందన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే అవతార పురుషుడిగా అవతరించి బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని, నిమ్న వర్గాలు అభివృద్ధి చెందాలంటే విద్య అవసరమని ఆనాడే గుర్తించి విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు.  స్వాతంత్య్రోద్యమానికి ముందు సాంఘిక సంస్కరణోద్యమం ద్వారా సమాజంలోని వివిధ రుగ్మతలను రూపుమాపేందుకు పూలే విశేష కృషి చేశారన్నారు. 
 
భారతదేశంలో మహోన్నత సంఘసంస్కర్త అని, పూలే దంపతులు సమాజం కోసం తమ జీవితాన్ని త్యాగం చేశారన్నారు.  ఫూలే తన భార్య సావిత్రిబాయికి విద్యాబుద్ధులు నేర్పించి మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా చరిత్రలో నిలిచిపోయేలా చేశారని చెప్పారు. ఆమె స్ఫూర్తితోనే ప్రస్తుతం మహిళలు ఉన్నత విద్యావంతులై అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. ఎందరో మహానుభావులు పూలేను తమ గురువుగా భావించారన్నారు.    
 
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు శ్రీ గోవింద రాజన్, శ్రీమతి స్నేహలత, శ్రీ దేవేంద్ర బాబు, టీటీడీ ఉద్యోగులు పాల్గొన్నారు.
 
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.