బూర‌గ‌మంద శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

బూర‌గ‌మంద శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుపతి, 2023 ఏప్రిల్ 30: చిత్తూరు జిల్లా స‌దుం మండ‌లం బూర‌గ‌మంద గ్రామంలో
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. మే 1 నుండి 9వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.

ఆదివారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 గంటల నుండి సేనాధిపతి ఉత్సవం, మేదినీపూజ, మృత్సంగ్రహణం, శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 8 గంటలకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 10వ తేదీన రాత్రి 7 గంట‌లకు పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

01-05-2023 –
ధ్వజారోహణం

02-05-2023
– శేష వాహనం

03-05-2023
హంస వాహనం

04-05-2023
హనుమంత వాహనం

05-05-2023
కల్యాణోత్సవం
గరుడ వాహనం

06-05-2023
పుష్ప పల్లకి

07-05-2023
సింహ వాహనం

08-05-2023
అశ్వవాహనం

09-05-2023
ఉదయం – చక్రస్నానం,
సాయంత్రం – గజ వాహనం, ధ్వజావరోహణం

ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు భక్తి సంగీత కార్యక్రమం, హరికథాగానం, కోలాటాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.