“VENKATADRI APP” TO OFFER COMPREHENSIVE INFORMATION TO DEVOTEES: TTD IT CHIEF _ భక్తులకు సమగ్ర సమాచారం.. సేవల్లో అత్యాధునిక సాంకేతికత
Tirumala, 13 October 2026: The newly launched Venkatadri App is intended to provide devotees with comprehensive information on Tirumala services in a concise and user-friendly format, said the General Manager of TTD IT wing Sri Venkateswarulu Naidu.
Briefing media persons on IT wing activities at the Media Centre set up in Rambagicha-2 on Tuesday in Tirumala he said, TTD has extensively leveraged information technology to enhance the Srivari Darshan experience through its AI-driven Command Control Centre.
TTD proposes to further strengthen traffic management at the Alipiri check-point by introducing an automated number-plate verification system.
In addition, a QR-code-based verification system has been enabled for gallery passes issued during the ongoing Brahmotsavams.
Clarifying concerns circulating on social media over the booking of ₹300 Special Entry Darshan (SED) tickets, Sri Naidu explained that the online quota was limited, while demand was nearly ten times higher.
He reiterated that TTD has been consistently identifying and blocking third-party websites that use automated form-filling and copy-paste tools to generate fake SED tickets.
Such fraudulent operations are being regularly detected, blocked and banned, he maintained.
He affirmed that TTD has deployed robust and reliable technology to facilitate devotees.
Devotees facing any difficulty or requiring clarification may contact the TTD helpline for assistance.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
భక్తులకు సమగ్ర సమాచారం.. సేవల్లో అత్యాధునిక సాంకేతికత
వేంకటాద్రి యాప్‌తో తిరుమల సమాచారం సులభంగా
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లపై దుష్ప్రచారాన్ని నమ్మవద్దు
టీటీడీ ఐటీ జీఎం శ్రీ వేంకటేశ్వర్లు నాయుడు
తిరుమల, 2026 అక్టోబరు 13: తిరుమలకు విచ్చేసే భక్తులకు సమగ్ర సమాచారం, మెరుగైన సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వేంకటాద్రి యాప్‌ను ప్రారంభించినట్లు టీటీడీ ఐటీ జీఎం శ్రీ వేంకటేశ్వర్లు నాయుడు తెలిపారు.
తిరుమల రాంభగీచా-2లోని మీడియా సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృతంగా ఐటీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు.
దర్శన క్యూలైన్లపై నిరంతర పర్యవేక్షణ
దర్శన క్యూలైన్ల నిర్వహణను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. త్వరలో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజున గ్యాలరీ పాసుల జారీకి క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
రూ.300 దర్శన టికెట్లపై దుష్ప్రచారాన్ని నమ్మవద్దు
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌పై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని శ్రీ వేంకటేశ్వర్లు నాయుడు విజ్ఞప్తి చేశారు. టికెట్లు పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉండగా, వాటికి పదిరెట్లు అధికంగా డిమాండ్ ఉండటంతో టికెట్లు లభించకపోవడాన్ని వెబ్‌సైట్‌లో సమస్యగా భావిస్తున్నారని తెలిపారు.
టీటీడీ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయడం సాధ్యం కాదని, థర్డ్ పార్టీ యాప్‌లు, ఆటో ఫిల్లింగ్, కాపీ-పేస్ట్ టూల్స్ ద్వారా టికెట్లు బుక్ చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని గుర్తించి ఎప్పటికప్పుడు బ్లాక్ చేస్తున్నట్లు చెప్పారు.
భక్తులకు నాణ్యమైన సేవలు అందించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. దర్శన టికెట్ల బుకింగ్‌పై సందేహాలుంటే టీటీడీ అధికారిక హెల్ప్‌లైన్‌ను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా, టిటిడి అధికారిక వెబ్ సైట్ ద్వారా శ్రీవారి దర్శనం, వసతి తదితర సేవలను బుక్ చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీపీఆర్వో డాక్టర్ టి. రవి, శ్వేత డైరెక్టర్ డాక్టర్ వేమా వేంకటరత్నం పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.


