DWARAKA KRISHNA ON CHINNA SESHA VAHANAM _ చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Tirumala, 2026 October 13: Sri Malayappa Swamy blessed devotees in Dwaraka Krishna Alankaram while riding the five-headed Chinna Sesha Vahanam on Tuesday morning, the second day of the ongoing annual Srivari Salakatla Brahmotsavams.
The vahana seva was held in a grand and devotional atmosphere, with elephants and horses leading the procession, accompanied by traditional musical instruments, kolatam and various cultural programmes.
Chinna Sesha is associated with Vasuki, the divine serpent king. Devotees believe that witnessing the Chinna Sesha Vahanam brings family well-being and the spiritual benefits of Kundalini Yoga.
Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Sri Chinna Jeeyar Swamy, TTD EO Sri Muddada Ravichandra, Board Members, Additional EO Sri Ch Venkaiah Chowdary, CVSO Sri Muralikrishna and other officials participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
గోవింద నామస్మరణలు.. మంగళవాయిద్యాలు.. కోలాటాల నడుమ వైభవంగా వాహనసేవ
తిరుమల, 2026 అక్టోబరు 13: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.
సర్వాలంకార భూషితుడైన స్వామివారిని దర్శించుకుని భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
ముందుగా గజాలు, అశ్వాలు నడుస్తుండగా, భక్తుల కోలాటాలు, మంగళవాయిద్యాలు, వివిధ కళాబృందాల ప్రదర్శనల నడుమ వాహనసేవ కన్నులపండువగా సాగింది. గోవింద నామస్మరణలతో తిరుమల మాడ వీధులు మార్మోగాయి.
చిన్నశేష వాహనం – కుటుంబ శ్రేయస్సుకు ప్రతీక
వైష్ణవ సంప్రదాయంలో భగవంతుడిని ‘శేషి’గా, ప్రపంచాన్ని ‘శేషభూతం’గా భావిస్తారు. నాగరాజైన వాసుకిని ప్రతిబింబించే చిన్నశేష వాహనం ఈ శేషి భావాన్ని చాటిచెబుతుంది. చిన్నశేష వాహనంపై స్వామివారిని దర్శించుకోవడం వల్ల కుటుంబ శ్రేయస్సు కలుగుతుందని, కుండలినీ యోగసిద్ధి ఫలాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.
రాత్రి హంస వాహనంపై స్వామివారు
మంగళవారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి, పాలకమండలి సభ్యులు, సీవీఎస్వో శ్రీ కేవీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది

























