MAHATMA JYOTHI RAO PULE FOLLOWED THE STEPS OF ANNAMAIAH & VENGAMAMBA- TTD (E&H) _ JEOఅన్న‌మ‌య్య, వెంగ‌మాంబ బాట‌లో న‌డిచిన జ్యోతిబా పూలే : టిటిడి జెఈవో(ఆరోగ్యం, విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

Tirupati, 11 April 2022: TTD JEO (Education &Health) Smt Sada Bhargavi said on Monday that on the lines of Annamaiah and Vengamamba, Mahatma Jyoti Rao Phule fought to achieve equality in society.

Addressing the 195th Jayanthi fete of Mahatma Jyoti Rao Phule as Chief Guest at Mahati auditorium in Tirupati the TTD JEO said caste, gender and group divisions were man-made hazards and social reformers like Annamaiah and Vengamamba through sankeetans did service while Phule strived to eliminate them from society with education.

She called for study of life history of such reformers to inspire youth in their life’s journey. She said Phule laid importance to women education and because of a great humane like Phule today many women like her could able to become officers.

Dr Pratyusha Subba Rao, counselling psychologist from Guntur said Phule launched the first school for untouchables and his book Gulamgiri has become a research material at Stanford University.

Dr D Rajita, a lecturer from Hyderabad said Mahatma Phule was known for sacrifice and his wife Savitribai Phule was the first women teacher in India. She said Phule started women empowerment a couple of centuries ago from his house with his wife and gave life to many women.

Earlier TTD employees led by JEO Sri Bhargavi garlanded the statue of Mahatma Phule at Balaji colony and later came in procession to Mahati auditorium.

They also garlanded portraits of Sri Venkateswara and Mahatma Phule. Later 20 TTD employees who rendered meritorious service and the winners of essay and quiz contests were presented prizes.

DyEOs Sri Damodaram, Sri Devendra Babu, Smt Jagadiswari, BC Liaison officer Dr Bharat, Medical Superintendent Dr Kusuma Kumari, TTD employees were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

అన్న‌మ‌య్య, వెంగ‌మాంబ బాట‌లో న‌డిచిన జ్యోతిబా పూలే : టిటిడి జెఈవో(ఆరోగ్యం, విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

మ‌హ‌తిలో ఘన‌గా 195వ జ‌యంతి ఉత్స‌వం

తిరుపతి, 2022 ఏప్రిల్ 11: శ్రీ‌వారి ప‌ర‌మ‌భ‌క్తులైన శ్రీ తాళ్ల‌పాక అన్న‌మ‌య్య‌, మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ కొన్ని శ‌తాబ్దాల ముందే త‌మ సంకీర్త‌న‌ల ద్వారా సామాజిక స‌మాన‌త్వం కోసం పాటు ప‌డ్డార‌ని, వారి మార్గంలోనే మ‌హాత్మ జ్యోతిబా పూలే న‌డిచార‌ని టిటిడి జెఈవో(ఆరోగ్యం, విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి పేర్కొన్నారు. మ‌హాత్మ జ్యోతిబా పూలే 195వ జ‌యంతి ఉత్స‌వం సోమ‌వారం తిరుప‌తిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో ఘ‌నంగా జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ భ‌గ‌వంతుడు కుల‌, వ‌ర్గ, లింగబేధం లేకుండా అంద‌రినీ స‌మానంగా చూస్తార‌ని, ఈ తార‌త‌మ్యాల‌న్నీ మ‌నుషులు సృష్టించుకున్న‌వేన‌ని అన్నారు. సాటి మ‌నిషిలో దేవున్ని చూడాల‌ని, మాన‌వ‌త్వానికి మించిన సంస్కారం, సంస్కృతి మ‌రొక‌టి లేద‌ని చెప్పారు. భ‌గ‌వంతునిపై పూర్తి విశ్వాసం ఉంచితే త‌ప్ప‌కుండా మ‌న‌ల్ని ఆదుకుంటార‌న్నారు. అణగారిన వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఇలాంటి మ‌హ‌నీయుల జీవిత‌చ‌రిత్ర‌ల‌ను పిల్ల‌ల చేత చ‌దివించాల‌ని కోరారు. ప్ర‌తి ఒక్క‌రూ వీరి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. స్త్రీ శ‌క్తిని గుర్తించి ప్రోత్స‌హించిన ఇలాంటి నాయ‌కుల కార‌ణంగానే, త‌న‌లాంటి వారికి ఉన్న‌తాధికారులుగా సేవ‌చేసే అవ‌కాశం ల‌భించింద‌న్నారు. టిటిడి ఉద్యోగులు కులాల‌కు అతీతంగా క‌లిసిక‌ట్టుగా మ‌హ‌నీయుల జ‌యంతి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నార‌ని చెప్పారు. కోవిడ్ స‌మ‌యంలోనూ నిబంధ‌న‌లు పాటిస్తూ మ‌హ‌నీయుల జ‌యంతి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించామ‌న్నారు.

గుంటూరుకు చెందిన కౌన్సెలింగ్ సైకాల‌జిస్ట్ డా. ప్ర‌త్యూష సుబ్బారావు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబా పూలే, డా. బిఆర్‌.అంబేద్క‌ర్ లాంటి మ‌హ‌నీయుల ఆలోచ‌నా స‌ర‌ళిని నేటి యువ‌త అల‌వ‌రుచుకుంటే దేశం ప్ర‌పంచంలోనే మొద‌టిస్థానానికి చేరుతుంద‌న్నారు. అమెరికాలోని ప్ర‌ఖ్యాత స్టాన్‌ఫోర్డ్ విశ్వ‌విద్యాల‌యం పూలే రాసిన గులాంగిరి అనే పుస్త‌కాన్ని ప‌రిశోధించి అనేక ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ప్ర‌పంచానికి తెలియ‌జేసింద‌న్నారు. అందరినీ క‌లుపుకుని పోవ‌డం, లోతుగా ప‌రిశీలించ‌డం అనేవి వీరికున్న ల‌క్ష‌ణాల‌ని తెలిపారు. అంట‌రానివారి కోసం మొద‌ట‌గా పాఠ‌శాల ఏర్పాటుచేశార‌ని, మ‌హిళ‌ల విద్య‌ను ప్రోత్స‌హించార‌ని తెలిపారు. పూలే ఆశించిన స‌మాన‌త్వం కోసం అంద‌రూ కృషి చేయాల‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న కోరారు.

హైద‌రాబాద్‌కు చెందిన అధ్యాప‌కురాలు డా. డి.ర‌జిత మాట్లాడుతూ అడుగ‌డుగునా త్యాగం, దార్శ‌నిక‌త నిండిన మ‌హ‌నీయుడు పూలే అన్నారు. ఆయ‌న స‌తీమ‌ణి శ్రీ‌మ‌తి సావిత్రీబాయి పూలేని దేశంలోనే మొద‌టి మ‌హిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దార‌ని తెలిపారు. విద్య లేక‌పోతే జ్ఞానం, వికాసం, ఆర్థిక చైత‌న్యం, రాజ‌కీయ చైత‌న్యం ఉండ‌ద‌ని, ఈ విష‌యాన్ని గుర్తించి అణ‌గారిన వ‌ర్గాల కోసం విద్య‌ను అందించారని తెలిపారు. జీవితాంతం స‌మానత్వం కోసం ప‌రిత‌పించార‌ని చెప్పారు.

అంత‌కుముందు తిరుప‌తిలోని బాలాజి కాల‌నీలో గ‌ల జ్యోతిబా పూలే విగ్ర‌హం నుండి జెఈవోతోపాటు, టిటిడి ఉద్యోగులు ర్యాలీగా మ‌హ‌తి క‌ళాక్షేత్రానికి చేరుకున్నారు. మొద‌ట‌గా మ‌హ‌తిలో శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి, జ్యోతిబాపూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సంద‌ర్భంగా విశేష సేవ‌లందించిన 20 మంది ఉద్యోగులకు జ్ఞాపిక‌లు, వ్యాస‌ర‌చ‌న‌, క్విజ్ పోటీల్లో గెలుపొందిన వారికి బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు శ్రీ దామోద‌రం, శ్రీ దేవేంద్ర‌బాబు, శ్రీ‌మ‌తి జ‌గ‌దీశ్వ‌రి, లైజాన్ అధికారి డాక్ట‌ర్ భ‌ర‌త్‌, మెడిక‌ల్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ కుసుమ‌కుమారి, టిటిడి ఉద్యోగులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.