MAHA SAMPROKSHANA PROGRAM BEGINS AT SRI LNS TEMPLE ON GHAT ROAD _ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం
Tirumala, 11 April 2022: The holy Maha Samprokshana fete at Sri Lakshmi Narasimha Swamy temple in First ghat road commenced on Monday.
As part of festivities, Akalmasha Homa, Panchangavya Aradhana were performed at Yagashala on Monday and later in the evening Punyahavachanam, Agni pratista, Kalakarshana, Kumbha sthapana, Kumbha Aradhana and other homas were performed.
Srivari temple chief archaka Sri Venugopal Dikshitulu, vaikhanasa Agama adviser Sri Mohana Rangacharyulu and others were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం
తిరుమల, 2022 ఏప్రిల్ 11: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.
ఇందులో భాగంగా సోమవారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు అకల్మష హోమం, పంచగవ్యరాధన యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు పుణ్యాహవచనం, అగ్నిప్రతిష్ట, కళాకర్షణ, కుంభస్థాపన, కుంభారాధన, ఉక్త హోమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు,వైఖానస ఆగమ సలహాదారు శ్రీ మోహన రంగాచార్యులు, రుత్వికులు, ఇతర అదికారులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.