VASANTHOTSAVAMS CONCLUDES _ మహాపూర్ణాహుతితో ముగియనున్న వసంతోత్సవాలు

Tirupati,17 May 2022: The three-day annual celebrations of  Vasantotsavam concluded at the Sri Padmavati Ammavari temple in Tiruchanoor on Tuesday with the Maha Purnahuti fete.

 

As part of the final day events after the Nitya Kainkaryams, Sahara Namarchana was performed for Goddess Padmavati ahead of a procession in the Friday Gardens followed by the Snapana  Tirumanjanam.

 

Later at night the utsava idol of Ammavaru was paraded on Mada streets to bless the devotee and thereafter conduction of Maha Purnahuti fete to herald the conclusion of the Vasantotsavam fete.

 

Temple Dyeo Sri Lokanatham, AEO Sri Prabhakar Reddy, archaka Sri Babuswami, Superintendent Sri Seshagiri, temple inspector Sri Damodaram were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

– మహాపూర్ణాహుతితో ముగియనున్న వసంతోత్సవాలు

తిరుపతి, 2022 మే 17: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు మంగ‌ళ‌వారం రాత్రి వైభవంగా ముగియనున్నాయి.

చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు.

రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మ‌వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు. ఆ తరువాత మహాపూర్ణాహుతితో అమ్మవారి వసంతోత్సవాలు ముగియనున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాధం, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూప‌రింటెండెంట్ శ్రీ శేష‌గిరి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ దామోదరం పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.