ALL OUT EFFORTS TO GRANDLY CELEBRATE ANNAMAIAH JAYANTI AND POPULARISE HIS SANKEERTANS- TTD CLARIFIES _  అన్నమయ్య జయంతి  ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము – టీటీడీ స్పష్టీకరణ

Tirupati,17 May 2022: TTD clarified that it had made all arrangements for grand celebrations of Saint poets Sri Tallapaka Annamacharya’s 614th Jayanti and also strived to popularise his sankeertans in public domain.

 

In a statement on Tuesday TTD listed out the programs for Jayanti fete scheduled between May 16 – 22 at Dhyana Mandiram. In Tallapaka, at 108 feet statue of Sri Annamaiah on highway and at two venues in Tirupati.

 

Among others besides grand Srivari Kalyanam at Tallapaka, TTD had also organised music programs and organized Sadas at Tirupati cherished by many denizens 

 

Similarly TTD has published Annamacharys sankeertans in book form with meaning and commentary which is being released during Jayanti celebrations.

 

Another 280 sankeertans are recorded freshly and uploaded on TTD website.

 

Besides an all out operation to publish all sankeertans of Sri Annamacharya with commentary etc.

 

TTD is popularising the sankeertans through special programs on SVBC like Adigo Alladigo etc. to engage the youth in the devotional campaign.

 

TTD said in the backdrop of all these realities certain vested interests are deliberately campaigning that TTD was indifferent towards Sri Annamacharya Jayanti with an altruistic intent to malign the reputation of the organisation.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 అన్నమయ్య జయంతి  ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము
 
– ఆయన సంకీర్తనలు మరింతగా జనబాహుళ్యంలోకి తీసుకుని వెళ్ళడానికి కృషి జరుగుతోంది
 
  –   టీటీడీ స్పష్టీకరణ
 
 తిరుపతి, 17 మే2022: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 614వ జయంతి ఉత్సవాలు ఎప్పటిలాగే ఈ సారి కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని టీటీడీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అన్నమాచార్యుల వారు రచించిన సంకీర్తనలను మరింతగా జనబాహుళ్యంలోకి తీసుకుని వెళ్ళడానికి పెద్ద ఎత్తున కృషి జరుగుతోందని తెలిపింది.
 
మే 16 నుండి 22వ తేదీ వ‌ర‌కు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, రాజంపేట బైపాస్ లోని 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరంలో అన్నమాచార్య జయంతి కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. 
 
మే 16 వ తేదీన తాళ్ల‌పాక‌లోని ధ్యాన‌మందిరం వ‌ద్ద ఉద‌యం 10 గంట‌ల‌కు శ్రీవారి కల్యాణం ఘనంగా నిర్వ‌హించాము.
 
మే 16 నుండి 18వ తేదీ వరకు సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు సంగీత,సాహిత్య  కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది.
 
రాజంపేట బైపాస్ రోడ్డులో ఉన్న 108అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద కూడా సంగీత, సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.
 
అదేవిధంగా,తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మే 16 నుండి 22వ తేదీ వరకు ఉదయం 9 గంటలకు, రాత్రి 7 గంటలకు సంగీత కార్యక్రమాలు, సాయంత్రం 6 గంటలకు సాహితీ సదస్సు నిర్వ‌హించడం జరుగుతోంది.
 
మహతి కళాక్షేత్రంలో మే 16 నుండి 22వ తేదీ వరకు సాయంత్రం 6 గంట‌ల‌ నుండి రాత్రి 8.30 గంటల వరకు ప్ర‌ముఖ  విద్వాంసులచే గాత్ర‌, వాద్య‌, నృత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నింటిలో పెద్ద సంఖ్యలో భక్తులు, అన్నమాచార్య సంకీర్తనల ప్రియులు పాల్గొంటున్నారు.
       
గత ఏడాది కాలంలో అన్నమాచార్య సంకీర్తనల్లోని 1 నుంచి 512 సంకీర్తనలకు అర్థ, తాత్పర్యంతో పుస్తకం ప్రచురించడానికి టీటీడీ ప్రత్యేక కృషి చేసింది. ఈ పుస్తకం అన్నమయ్య జయంతి ఉత్సవాల్లోనే విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ద్వారా 280 అన్నమాచార్య సంకీర్తనలను కొత్తగా రికార్డ్ చేయించి వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. అన్నమాచార్యుల సంకీర్తనలు అందరికీ అర్థమయ్యేలా ప్రతి పదానికి అర్థ, తాత్పర్యాలను ముద్రించే మహా కార్యం కొనసాగుతున్నది.  అదివో అల్లదివో  కార్యక్రమం ద్వారా యువ కళాకారులను భక్తి మార్గం వైపు నడిపించడానికి అన్నమయ్య సంకీర్తనలపై పోటీలు నిర్వహించి, ఈ కార్యక్రమం ఎస్వీబీసీ లో ప్రసారం చేయడం జరిగింది.
 
వాస్తవాలు ఇలా ఉంటే కొంతమంది వ్యక్తులు తమ వ్యక్తి గత ప్రచారం కోసం టీటీడీ అన్నమాచార్య జయంతి వేడుకల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేయడం భావ్యం కాదు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.