మార్చి 2 నుండి 10వ తేదీ వరకు తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

మార్చి 2 నుండి 10వ తేదీ వరకు తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2020 ఫిబ్ర‌వ‌రి 29: తిరుమల తిరుపతి దేవస్థాన‌ముల‌కు అనుబంధంగా ఉన్న  తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో మార్చి 2 నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. మార్చి 1వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ                                       ఉదయం                                      రాత్రి

02-03-2020(సోమవారం)     ధ్వజారోహణం                        హంసవాహనం,

03-03-2020(మంగళవారం)   ముత్యపుపందిరి వాహనం    హనుమంత వాహనం

04-03-2020(బుధవారం)         కల్పవృక్ష వాహనం              సింహ వాహనం

05-03-2020(గురువారం)        తిరుచ్చి ఉత్స‌వం                  పెద్దశేష వాహనం

06-03-2020(శుక్రవారం)         తిరుచ్చి ఉత్స‌వం                    గజవాహనం    

07-03-2020(శనివారం)            తిరుచ్చి ఉత్స‌వం   సర్వభూపాల వాహనం,  కల్యాణోత్సవం, గరుడ వాహనం
             
08-03-2020(ఆదివారం)           రథోత్సవం                               ధూళి ఉత్సవం

09-03-2020(సోమ‌వారం)         సూర్యప్రభవాహనం    చంద్రప్రభ వాహనం, పార్వేట ఉత్స‌వం,అశ్వ వాహనం

10-03-2020(మంగ‌ళ‌వారం)     వసంతోత్సవం, చక్రస్నానం      ధ్వజావరోహణం

కాగా, మార్చి 7వ తేదీ రాత్రి  8.00 నుండి 10.00 గంటల వరకు కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. మార్చి 11వ తేదీ సాయంత్రం 5.30 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.