KOIL ALWAR TIRUMANJANAM ON MAY 2 _ మే 2న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం 

Tirupati,30 April 2023: TTD is organising the Koil Alwar Tirumanjanam fete at Sri Padmavati Ammavari temple in Tiruchanoor on May 2 in connection with the annual Vasanthotsavam from May 4  to May 6.

Ankurarpanam will be performed on May 3 evening and interested devotees shall participate in the Vasanthotsavam with ₹150 per ticket per person.

The temple cleansing fete will commence at 6am and darshan will commence after 9am.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 2న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2023 ఏప్రిల్‌ 30: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 2న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. అమ్మవారి ఆలయంలో మే 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం మే 3వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ నిర్వ‌హిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు.

ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 9 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.