ANKURARPANAM OF BTU AT SRI KV TEMPLE, NARAYANAVANAM ON MAY 30 _ _ మే 30న నారాయ‌ణ‌వ‌నం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌

Tirupati,29, May 2023: TTD is organising the Ankurarpanam fete for the ensuing annual Brahmotsavam of Sri Kalyana Venkateswara Temple, Narayanavanam on May 30 evening with traditional rituals of Punyahavachanam, Mrutsyagrahanama and senadhipati utsavam.

 

Following are details of daily vahana sevas.

 

31-05-2023    Dwajarohanam and Pedda Sesha Vahana 

 

01-06-2023    Chinna Sesha Vahana and Hamsa Vahana 

 

02-06-2023     Simha Vahana and Muthyapu pandiri Vahana 

 

03-06-2023     Kalpavruksha and Sarva Bhupala Vahana 

 

04-06-2023     Mohini avatar and Garuda Vahana 

 

05-06-2023     Hanumantha vahana and Gaja Vahana 

 

06-06-2023     Surya Prabha and Chandra Prabha Vahana 

 

07-06-2023     Rathotsavam and Kalyanotsavam and Aswa Vahana 

 

08-06-2023     Chakra snanam and Dwaja Avarohanam 

 

Besides daily Vahana Sevas in the morning and evening, TTD is organising Swami Kalyanotsavam on June 7 evening and grihastha would participate with a ticket of 1000 and beget Prasadam of one uttarium, one blouse, one vada, and Kukumam.

 

The artists of TTD’s HDPP, Dasa Sahitya project and Annamacharya project will conduct cultural programs including bhajans, kolatas etc on all nine days of the Brahmotsavam.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మే 30న నారాయ‌ణ‌వ‌నం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2023 మే 29: నారాయ‌ణ‌వ‌నం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో మే 31వ తేదీ నుండి జూన్ 8వ తేదీ వరకు నిర్వహించే బ్ర‌హ్మోత్స‌వాల‌కు మే 30న అంకురార్పణం నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు పుణ్యాహ‌వాచ‌నం, మృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వ‌ము, శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

    తేదీ                              ఉదయం                      సాయంత్రం

31-05-2023              ధ్వజారోహణం               పెద్దశేష వాహనం

01-06-2023          చిన్నశేష వాహనం           హంస వాహనం

02-06-2023           సింహ వాహనం      ముత్యపుపందిరి వాహనం

03-06-2023        కల్పవృక్ష వాహనం        సర్వభూపాల వాహనం

04-06-2023        మోహినీ అవతారం       గరుడ వాహనం

05-06-2023        హనుమంత వాహనం     గజ వాహనం

06-06-2023         సూర్యప్రభ వాహనం     చంద్రప్రభ వాహనం

07-06-2023          రథోత్సవం కల్యాణోత్సవం, అశ్వవాహనం

08-06-2023           చక్రస్నానం                 ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 7వ తేదీ రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రూ.1000/- చెల్లించి గృహస్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక వడ, కుంకుమ బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.