ANKURARPANAM OF APPALAYAGUNTA SRI PV TEMPLE ON MAY 30 _ మే 30న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ 

Tirupati,29, May 2023: TTD is organising Ankurarpanam fete for the annual Brahmotsavam celebrations of Sri Prasanna Venkateswara temple, Appalayagunta  on May 30 

 
All arrangements are made for the  Brahmotsavam festivities between May 31-June 8 and details of vahana Sevas are as below.

           

31-05-2023  Dwajarohanam and Pedda Sesha Vahana

 

01-06-2023  Chinna Sesha Vahana and  hamsa vahana 

 

02-06-2023  Simha Vahana and Muthyapu pandiri Vahana 

 

03-06-2023   Kalpavruksha  Vahana and Kalyanotsavam and Sarva bhupala vahana 

 

04-06-2023 Mohini avatars. And Garuda Vahana 

 

05-06-2023  Hanumantha vahana  and Gaja vahana 

 

06-06-2023  Surya Prabha and Chandra Prabha Vahana 

 

07-06-2023 Rathotsavam and Aswa vahana 

 

08-06-2023 Chakrasnanam and Dwaja Avarohanam

 

TTD is organising vahana Sevas both morning and evening and on June 3 a grand Kalyanotsavam is being organised in the evening in which a  devotee couple could participate with a ticket of 500 and beget Prasadam of one uttarium, blouse, laddu and appam.

 

The artists of TTD’s HDPP, Dasa Sahitya project and Annamacharya project will conduct cultural programs including bhajans, kolatas etc on all nine days of the Brahmotsavam.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మే 30న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2023 మే 29: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 31వ తేదీ నుండి జూన్ 8 వ తేదీ వరకు నిర్వహించే వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌కు మే 30వ తేదీ సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జరుగనుంది. సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు మేదినిపూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్ప‌ణ నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు.

వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.

                            ఉదయం                   సాయంత్రం 

31-05-2023    ధ్వజారోహణం         పెద్దశేష వాహనం

01-06-2023    చిన్నశేష వాహనం    హంస వాహనం

02-06-2023    సింహ వాహనం       ముత్యపుపందిరి వాహనం

03-06-2023    కల్పవృక్ష వాహనం    కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం

04-06-2023    మోహినీ అవతారం.     గరుడ వాహనం

05-06-2023   హనుమంత వాహనం    గజ వాహనం

06-06-2023    సూర్యప్రభ వాహనం      చంద్రప్రభ వాహనం

07-06-2023     రథోత్సవం                 అశ్వవాహనం

08-06-2023    చక్రస్నానం                   ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 3వ తేదీ సాయంత్రం 4.30 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.