NAGALAPURAM BRAHMOTSAVAMS FROM MAY 4-12 _ మే 4 నుండి 12వ తేదీ వరకు నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

TIRUPATI, 10 APRIL 2023: The annual Brahmotsavams at Sri Veda Narayana Swamy temple in Nagulapuram will be observed between May 4-12.

 

The important rituals and days includes Koil Alwar Tirumanjanam on May 2, Ankurarpanam on May 3, Dhwajarohanam on May 4, Garuda Seva on May 8, Rathotsavam and Arjita Kalyanotsavam on May 11 and Chakra Snanam on May 12.

 

Every day vahana sevas will be observed between 8am and 9:30am, again 7pm and 8:30pm.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
మే 4 నుండి 12వ తేదీ వరకు నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
 
తిరుపతి, 10 ఏప్రిల్ 2023: టీటీడీకి చెందిన నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 4 నుండి 12వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 2న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, 3న అంకురార్పణం నిర్వహిస్తారు. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.
 
04-05-2023 – ధ్వజారోహణం –  పెద్దశేష వాహనం
 
05-05-2023 – చిన్నశేష వాహనం – హంస వాహనం
 
06-05-2023 – సింహ వాహనం – ముత్యపుపందిరి వాహనం
 
07-05-2023 – కల్పవృక్ష వాహనం  సర్వభూపాల వాహనం
 
08-05-2023 – మోహినీ అవతారం – గరుడ వాహనం
 
09-05-2023 – హనుమంత వాహనం – గజ వాహనం
 
10-05-2023 – సూర్యప్రభ వాహనం  – చంద్రప్రభ వాహనం
 
11-05-2023 – రథోత్సవం, ఆర్జితకల్యాణోత్సవం – అశ్వవాహనం
 
12-05-2023 – చక్రస్నానం – ధ్వజావరోహణం.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.