RIGVEDA PARAYANAM COMMENCES _ రంగ‌నాయ‌కుల మండ‌పంలో రుగ్వేద‌ పారాయణం ప్రారంభం

TIRUMALA, 01 APRIL 2024: The Rigveda Parayanam commenced at Ranganayakula Mandapam in Tirumala temple on Monday for the fourth time in the Chaturveda Parayanam sequence.

TTD commenced this spiritual program on April 11 in 2020. A dozen Vedic Pundits participate in this recitation under the aegi of SV Higher Vedic Studies.

Everyday this program is telecast live between 9am and 10am on SVBC for the sake of global devotees.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

రంగ‌నాయ‌కుల మండ‌పంలో రుగ్వేద‌ పారాయణం ప్రారంభం

తిరుమల‌, 2024 ఏప్రిల్ 01: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో సోమ‌వారం రుగ్వేద‌ పారాయ‌ణం ప్రారంభ‌మైంది. ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో 12 మంది నిష్ణాతులైన వేద పండితులు పాల్గొని పారాయ‌ణం చేశారు.

లోక క‌ల్యాణార్థం శ్రీ‌వారిని ప్రార్థిస్తూ 2020, ఏప్రిల్ 11వ తేదీ నుండి టీటీడీ చ‌తుర్వేద పారాయ‌ణం ప్రారంభించింది. మొత్తం నాలుగు వేదాల్లోని ఐదు శాఖ‌లు మూలం పారాయ‌ణం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సార్లు చ‌తుర్వేద పారాయ‌ణం పూర్తి చేసి, మ‌ర‌ల 4వ సారి ఏప్రిల్ 1వ తేదీ నుండి రుగ్వేద‌ పారాయణం ప్రారంభించారు. ప్ర‌తి రోజు ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఈ పారాయ‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు.

చ‌తుర్వేద పారాయ‌ణం వ‌ల‌న అనంత‌మైన‌ ఫ‌లితం సిద్ధిస్తుంద‌ని ఎస్వీ ఉన్న‌త వేద అధ్య‌య‌న‌ సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ వేద పండితులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.