TTD TO PROMOTE RISHI VALLEY MODEL OF PRIMARY SCHOOL AT TATITOPU- TTD JEO (H&E) _ రుషివ్యాలీ తరహాలో తాటితోపు ప్రాథమిక పాఠశాల _ విద్యాసంస్థల సమీక్షలో జేఈవో శ్రీమతి సదా భార్గవి

UPDATE TTD EDUCATIONAL INSTITUTIONS SOFTWARE

Tirupati,16 February 2023: The JEO for Health and Education Smt Sada Bhargavi directed officials on Thursday to take steps to promote a Rishi valley model of primary school at the TTD school in Tatitopu village of Tirupati rural Mandal.

Addressing a review meeting on TTD educational institutions at Sri Padmavati Rest House in Tirupati, she said teachers should adopt a Rishi valley style of teaching methods and commence the role model school at Tatitopu from next academic year onwards.

Among others, she also reviewed with the officials concerned the Uniform syllabus, fire fighting equipment, parking sheds for cycles and other vehicles, painting and cleaning, clean toilets, Teachers interviews with parents, teachers’ adoption of students to achieve good results etc.

She also advised roping in old students to take up motivational classes for the personality development of the pupils studying in TTD Educational institutions.

She also wanted action plans for all schools and colleges to achieve 100 % results with stress-free methods, update softwares and separate websites in each of them.

TTD DEO Sri Bhaskar Reddy, IT GM Sri Sandeep, EEs Sri Manoharam, Sri Venugopal, Additional Health officer Dr Sunil, DE(Electrical) Smt Saraswathi were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

రుషివ్యాలీ తరహాలో తాటితోపు ప్రాథమిక పాఠశాల

– టీటీడీ విద్యాసంస్థల సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలి

విద్యాసంస్థల సమీక్షలో జేఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి 16 ఫిబ్రవరి 2023: తిరుపతి రూరల్ మండలం తాటితోపులోని టీటీడీ ప్రాథమిక పాఠశాలను రిషి వ్యాలీ పాఠశాల తరహాలో మోడల్ స్కూల్ గా తయారు చేయడానికి చర్యలు తీసుకోవాలని జేఈవో శ్రీమతి సదా భార్గవి అధికారుల ఆదేశించారు.

శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో గురువారం సాయంత్రం ఆమె టీటీడీ విద్యా సంస్థలపై సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు రుషివ్యాలి తరహాలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. వచ్చేఏడాది నుంచి తాటితోపు పాఠశాలలో రుషి వ్యాలి తరహా బోధన ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ఒకే తరహా సిలబస్, మోటివేషన్ తరగతులు, చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలకు అవసరమైన ఇంజినీరింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలని చెప్పారు. ప్రతి పాఠశాలలో అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనే పరికరాలు ఏర్పాటు చేయాలన్నారు. సైకిళ్ళు, ఇతర వాహనాల పార్కింగ్ కోసం షెడ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు జేఈవో సూచించారు. అవసరమైన పాఠశాల భవనాలకు పెయింటింగ్ వేయించాలని, తలుపులు, కిటికీలు, శుభ్రంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు ఉండేలా, వాటిని శుభ్రంగా నిర్వహించేలా చూడాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో టీచర్లు సమావేశాలు నిర్వహించి, పిల్లల ప్రగతి గురించి వివరించాలన్నారు. పాఠశాల, కళాశాలలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు కొంతమందిని అడాప్ట్ చేసుకుని మంచి మార్కులు సాధించే విధంగా తయారు చేయాలన్నారు. టీటీడీ విద్యా సంస్థల్లో చదివిన పూర్వ విద్యార్థి, ప్రస్తుత ఐఐటి విద్యార్థి గణితం, సైన్స్ లో మోటివేషన్ తరగతులు చెబుతున్నారని, మహర్షి సాగర్ తదితరులు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఇలాంటి తరగతులు అన్ని విద్యాసంస్థల్లో నిర్వహించాలని జేఈఓ సూచించారు.

విద్యార్థులకు ఒత్తిడి లేని చదువులు చెప్పేలా విద్యా బోధన ఉండాలని సూచించారు. ప్రతి పాఠశాల కళాశాల 100 శాతం ఫలితాలు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. టీటీడీ విద్యా సంస్థలన్నింటిలో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలని, ప్రతి కళాశాల, పాఠశాలకు ప్రత్యేకంగా వెబ్సైట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలన్నారు.

డిఈవో శ్రీ భాస్కర్ రెడ్డి, ఐటి జిఎం శ్రీ సందీప్ , ఈఈలు శ్రీ మనోహర్ , శ్రీ వేణుగోపాల్ , అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ , విద్యుత్ విభాగం డిఈ శ్రీమతి సరస్వతి పాల్గొన్నారు

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.