WOMEN’S DAY REVIEW MEETING HELD _ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాట్లపై జేఈవో సమీక్ష

TIRUPATI, 16 FEBRUARY 2023: In connection with International Women’s Day to be observed for TTD Women Employees on March 8, TTD JEO Sri Veerabrahmam held a review meeting on Thursday.

Detailed review on each subject was held in the Chambers’ of JEO in TTD Administrative Building at Tirupati. It included the selection of speakers and felicitation to the women who earned versatility in their respective fields, Food arrangements, cultural programmes, Padmavathi Awards to 25 women employees for their extraordinary services etc.

The JEO also reviewed the various committees including Invitation, Speakers’ Selection, Cultural Programmes, Competition, Selection of mementos and prizes, Food, Stage and Reception committees in a thorough manner and assigned duties and responsibilities to execute to each woman officer.

He also suggested holding a Blood Donation Camp on the other and a small video documentary on women achievers in various fields.

The JEO also advised to include a young women achiever in the field of IT since the theme of this year is “DigitALL Innovation and Technology for Gender Equality”.

He directed to come out with an action plan in a week’s time on each subject and ensure that the International Women’s Day be celebrated in a grand and innovative manner.

Welfare Officer Smt Snehalata, Health Officer Dr Sridevi, DyEOs Smt Padmavathi, Smt Shanti, Smt Nagaratna, Smt Bharati, Smt Jagadeeshwari, Principals Smt Narayanamma, Smt Asunta, Medical Superintendents Dr Kusuma Kumari, Dr Renu Dixit, various committee members were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాట్లపై జేఈవో సమీక్ష

తిరుపతి, 2023 ఫిబ్రవరి 16: టిటిడి ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీన నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాట్లపై తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల కార్యాలయంలో జెఈఓ శ్రీ వీరబ్రహ్మం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ ఈ ఏడాది మరింత చక్కగా మహిళా దినోత్సవం నిర్వహించాలని, ఇందుకోసం టిటిడి మహిళా అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన ఆర్గనైజింగ్ కమిటీ, స్పీకర్స్ కమిటీ, పర్చేజ్ కమిటీ, కల్చరల్ కమిటీ, ఇన్విటేషన్ కమిటీ, ఫుడ్ కమిటీల విధులు, బాధ్యతలను తెలియజేశారు. వివిధ రంగాల్లో నిపుణులైన వారిని ఉపన్యాసకులుగా ఆహ్వానించాలని, వీరిలో దివ్యాంగులుగా ఉండి రాణిస్తున్న వారు, ఐటీ రంగంలో నిష్ణాతులు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మహిళా రైతులు ఉండాలని సూచించారు. టిటిడి మహిళా ఉద్యోగులకు అందించే పద్మావతి అవార్డుల కోసం అర్హులైన వారిని ఎంపిక చేయాలని, కోవిడ్ సమయంలో విశేష సేవలు అందించిన టిటిడి వైద్య సిబ్బందికి కూడా అందించాలని అన్నారు. మహిళా ఉద్యోగులతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ సమీక్షలో ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి, డెప్యూటీ ఈవోలు శ్రీమతి స్నేహలత, శ్రీమతి శాంతి, శ్రీమతి నాగరత్న, శ్రీమతి పద్మావతి, శ్రీమతి జగదీశ్వరి, శ్రీమతి భారతి, సెంట్రల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమకుమారి, ఆయుర్వేద కళాశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి నారాయణమ్మ, మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి అశుంత, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.