RECORD 2030 HEART SURGERIES IN TWO YEARS- TTD EO _ రెండేళ్ల వ్య‌వ‌ధిలో 2,030 గుండె శ‌స్త్రచికిత్సలు

* EIGHT HEART TRANSPLANTS

* EXTRAORDINARY MEDICAL SERVICES AT SRI PADMAVATI CHILDREN’S HEART CENTRE

Tirupati, 08 November 2023: TTD EO Sri AV Dharma Reddy said the doctors at the TTD-run Sri Padmavati Children’s Heart Centre had in just two years performed a  record of 2030 heart surgeries including 8 successful heart transplants.

Addressing a media conference at the hospital on Wednesday the EO said the Heart Care Centre for infants was launched after the bifurcation of united AP on the directions of Honourable CM of AP Sri YS Jaganmohan Reddy in October 2021 with just a fifteen member doctors and paramedical team under the leadership of Dr Srinath Reddys and achieved a 95% success rate in heart surgeries.

He said the role model children’s hospital has gained recognition as a popular and best paediatric Medicare centre where unique procedures were performed under Arogyasree and union government health schemes as well.

Hospital’s Director Dr Srinath Reddy said all critical operations for both newborns and aged infants were successfully done with an expert doctor’s team.

Even costly high-risk operations were freely performed with funds from the CM relief fund and SV Pranadana Trust. Among others  Arteries transplants without open heart surgeries etc. are being done and soon kidney, brain and bone marrow operations will be undertaken with the completion of the 350-bed super specialty hospital with state-of-the-art medical equipment.

Dr Ganapathi Subramanyam of the hospital with an expert paramedical team and support from TTD, all poor patients were treated. He appealed to patients from Rayalaseema to make use of the advantage of the facility created by TTD.

Heart transplant Patients discharged 

Thereafter the TTD EO also interacted with Heart Transplant patients from Kurnool Sri Koteswar Reddy(32), Smt Sumati (31) from Guntur, Sri Karunakar (39) from Kakalur and enquired about facilities in hospital. Smt Sumati and Sri Karunakar were discharged later.

TTD JEO Smt Sada Bhargavi, Dr Soumya Kasturi, Dr Ganesh were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

రెండేళ్ల వ్య‌వ‌ధిలో 2,030 గుండె శ‌స్త్రచికిత్సలు

– ఎనిమిది మందికి గుండె మార్పిడి

– శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయలో మెరుగైన వైద్య‌సేవ‌లు

– మీడియా స‌మావేశంలో టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి

తిరుపతి, 2023 నవంబరు 08: టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ‌లో వైద్యులు రెండేళ్ల వ్య‌వ‌ధిలో రికార్డు సంఖ్యలో 2,030 గుండె శస్త్ర చికిత్సలు పూర్తి చేశార‌ని టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి తెలిపారు. అదేవిధంగా, ఎనిమిది మందికి గుండె మార్పిడి శ‌స్త్రచికిత్సలు చేయగా ఏడు విజయవంతం అయ్యాయని, వీరు ఆరోగ్యంగా జీవనం సాగిస్తున్నారని తెలియజేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయలో బుధవారం ఈవో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపిల్లల కోసం ఆసుపత్రి ఉండాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రివ‌ర్యులు శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి 2021 అక్టోబరులో ఈ ఆసుపత్రిని ప్రారంభించార‌ని తెలిపారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 15 మంది వైద్య బృందం, నర్సుల బృందం కలిసి ఎంతో అంకితభావంతో రోగుల‌కు సేవలు అందిస్తున్నారని చెప్పారు. శ‌స్త్రచికిత్స‌ల్లో 95 శాతం సక్సెస్ రేట్ ఉందని వెల్ల‌డించారు. సేవలకు గుర్తింపుగా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ ఆసుపత్రిగా అవార్డు కూడా లభించిందన్నారు. ఆరోగ్యశ్రీతో పాటు కేంద్ర ప్రభుత్వ హెల్త్ స్కీమ్ కింద ఉచితంగా శ‌స్త్రచికిత్స‌లు నిర్వహిస్తున్నామని తెలియజేశారు.

ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ రోజుల వయసుగల పిల్లల నుంచి పెద్దల వరకు సంక్లిష్టమైన గుండె సమస్యలకు నిపుణులైన వైద్య బృందంతో విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ ఖ‌ర్చుతోకూడిన హైరిస్క్ ఆపరేషన్లకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్, ఎస్వీ ప్రాణదాన ట్రస్టు కింద‌ పేదలకు ఉచితంగా గుండెవైద్యం అందిస్తున్నామన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా నరం ద్వారా క‌వాటాలు మార్చడం, ధమనుల శ‌స్త్రచికిత్సలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. త్వరలో 350 పడక‌లతో సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం పూర్తి కానుంద‌ని, ఇక్కడ కిడ్నీ, మెద‌డు, బోన్‌మ్యారో త‌దిత‌ర చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని విభాగాలకు అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉంటుందని వివ‌రించారు.

ఆసుపత్రి వైద్యులు డాక్టర్ గణపతి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైద్య బృందంతో పాటు నర్సింగ్ సిబ్బంది అంకితభావంతో సేవలు అందిస్తుండడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. టీటీడీ సహకారంతో అవసరమైన పేద రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామ‌ని చెప్పారు. రాయలసీమ ప్రాంతంలో అవయవ మార్పిడిపై అవగాహన పెరగాలని, అవయవ మార్పిడికి ప్రజలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

గుండె మార్పిడి రోగుల డిశ్చార్జి

ఈ సంద‌ర్భంగా గుండె మార్పిడి చేసుకున్న క‌ర్నూలుకు చెందిన శ్రీ కోటేశ్వ‌ర‌రెడ్డి(32), గుంటూరుకు చెందిన శ్రీ‌మ‌తి సుమ‌తి(31), కైక‌లూరుకు చెందిన శ్రీ క‌రుణాక‌ర్‌(39)తో ఈవో మాట్లాడారు. ఆసుప‌త్రిలో అందిస్తున్న వైద్యసేవ‌లు, సౌక‌ర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం శ్రీ‌మ‌తి సుమ‌తి, శ్రీ క‌రుణాక‌ర్‌ను డిశ్చార్జి చేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, ఆర్ఎంవో డాక్టర్ భరత్, ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సౌమ్య కస్తూరి, డాక్ట‌ర్ గ‌ణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.