TTD EXTENDS REFUND FACILITY FOR ONLINE TICKETS UP TO DECEMBER 31 _ లాక్‌డౌన్‌లో శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు, వ‌స‌తి బుక్ చేసుకున్న భ‌క్తులు రీఫండ్‌ పొందేందుకు డిసెంబరు 31 వరకు అవకాశం

Tirumala, 28 Oct. 20: TTD has extended the refund facility to pilgrims for all Arjita sevas, Accommodation and darshan tickets booked in online during the lockdown period up to December 31.

Devotees who had booked accommodation, darshan and arjita sevas in advance from March 13 for lockdown periods on either in online in TTD official website tirupatibalaji.ap.gov.in or in offline by means of post office or e-darshan and AP online had the option to get refund upto December 31.

The devotees who booked in online are given cancellation provision while those who booked in offline have to mail their bank account particulars, IFSC code etc.to refunddesk_1@tirumala.org and after verification they will get the refund.

TTD has also given another option to these devotees that they can avail darshan before December 31 this year on showing the tickets if they are not willing to cancel their darshan tickets.

ONLINE SALES OF CALENDARS AND DIARIES

TTD has enabled online sales of 2021 Calendars and Diaries for Srivari devotees on Wednesday.

The devotees can purchase the calendars and diaries by logging on to tirupatibalaji.ap.gov.in

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

లాక్‌డౌన్‌లో శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు, వ‌స‌తి బుక్ చేసుకున్న భ‌క్తులు రీఫండ్‌ పొందేందుకు డిసెంబరు 31 వరకు అవకాశం

2021 డైరీలు, క్యాలెండ‌ర్లు ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు అవ‌కాశం

తిరుమల, 28 అక్టోబరు 2020: లాక్‌డౌన్ కార‌ణంగా మార్చి 13 నుండి జూన్ 30వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్(tirupatibalaji.ap.gov.in) ద్వారాగానీ, పోస్టాఫీసు, ఇ-ద‌ర్శ‌న్ మరియు ఎపి ఆన్ లైన్ కౌంట‌ర్ల ద్వారా గానీ శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్లు, వ‌స‌తి గదులను బుక్ చేసుకున్న భ‌క్తులు వాటిని రద్దు చేసుకుంటే ఆ మొత్తాన్ని రీఫండ్ పొందేందుకు డిసెంబరు 31వ తేదీ వరకు టిటిడి మరో అవకాశం కల్పించింది.
           
ఈ మేర‌కు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులకు వాటిని ఆన్‌లైన్‌లోనే రద్దు చేసుకునే అవకాశం కల్పించారు. పోస్టాఫీసు, ఈ-దర్శన్ కౌంటర్లు మరియు ఎపి ఆన్ లైన్ కౌంట‌ర్ల ద్వారా బుక్ చేసుకున్న భ‌క్తులు సంబంధిత టికెట్ వివ‌రాల‌తోపాటు, బ్యాంకు ఖాతా నంబ‌రు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ వివ‌రాల‌ను excel టెక్ట్స్ లో‌ టైపు చేసి refunddesk_1@tirumala.org మెయిల్ ఐడికి పంపాల‌ని టిటిడి కోరుతోంది. మెయిల్ వివ‌రాల ఖ‌చ్చిత‌త్వాన్ని ప‌రిశీలించిన అనంత‌రం రీఫండ్ మొత్తాన్ని నేరుగా భ‌క్తుల ఖాతాల్లోకి జ‌మ చేస్తారు.

టికెట్లు రద్దు చేసుకుని రీఫండ్ పొందడానికి ఇష్టపడని భక్తులు డిసెంబరు 31వ తేదీలోపు వారికి అనువైన తేదీల్లో ఆ టికెట్లు చూపి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. ఈ రెండు అవకాశాల్లో ఒకదాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరడమైనది.

2021 డైరీలు, క్యాలెండ‌ర్లు ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు అవ‌కాశం

టిటిడి ముద్రించిన 2021 డైరీలు, క్యాలెండ‌ర్లను భ‌క్తులు ఆన్‌లైన్‌(tirupatibalaji.ap.gov.in) ద్వారా బుక్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించ‌డ‌మైన‌ది. భ‌క్తులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని కోర‌డమైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది