TTD DECIDES TO OBSERVE SRI PAT BRAHMOTSAVAMS IN EKANTHAM _ ఏకాంతంగా శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు – టిటిడి నిర్ణ‌యం‌ ‌

Tiruchanoor, 28 Oct. 20: The TTD has decided to conduct the annual Brahmotsavam, slated to begin from November 11- 19 of Sri Padmavati Ammavari Temple, Tiruchanoor in Ekantkam.

The TTD JEO Sri P Basant Kumar on advisor Wednesday held detailed consultations with Agama advisors, representatives of Tirumala pontiffs, and officials non state and central government guidelines in Covid-19, health safety of devotees, Ammavari Vahana sevas and conduction of Panchami thirtha utsavam.

Speaking on the occasion the TTD JEO said that Covid guidelines and restrictions were extended up to November end. Hence the Ammavari Brahmotsavam as per Agama traditions will be conducted inside the temple in Ekantkam.

He directed the Garden and electrical officials to coordinate in decorations and the health officials should take all precautions in garbage clearance and sanitation.

He said a final decision will be taken at Review meeting to be held by the TTD EO Dr KS Jawahar Reddy soon.

JEO (health & Education) Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti, CE Sri Ramesh Reddy, Agama adviser Sri Srinivasacharyulu, Archaka Sri Babuswami, Additional CVSO Sri Shivkumar Reddy, DyEO Smt Jhansi Rani, Tirupati Urban additional SP Smt Suprabaja, VGOs Sri Bali Reddy and Sri Prabhakar, Garden AD Sri Srinivasulu, Panchayat EP Sri JanArdhan and other officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏకాంతంగా శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు – టిటిడి నిర్ణ‌యం‌ ‌

తిరుప‌తి, 2020 అక్టోబ‌రు 28: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబరు 11 నుంచి 19వ తేదీ వరకు  ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది.

తిరుచానూరులోని ఆస్థాన మండ‌పంలో బుధ‌వారం జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌ ‌ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు.  కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాలు, భ‌క్తుల ఆరోగ్య భ‌ద్ర‌త‌, అమ్మ‌వారి వాహ‌న సేవ‌లు, పంచ‌మి తీర్థం నిర్వ‌హ‌ణ‌పై ఆగ‌మ స‌ల‌హాదారు, జీయ్యంగార్ల ప్ర‌తినిధులు, అధికారుల‌తో జెఈవో కూలంక‌షంగా చ‌ర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో శ్రీ బ‌సంత్‌కుమార్ మాట్లాడుతూ కోవిడ్ -19కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం అక్టోబ‌రు నెలాఖ‌రు వ‌ర‌కు అమ‌లు చేస్తున్న మార్గ‌ద‌ర్శ‌కాల‌ను నవంబ‌రు నెలా‌ఖ‌రు వ‌ర‌కు పొడిగించింద‌ని చెప్పారు. వీటిని దృష్టిలో ఉంచుకుని అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు ఆగ‌మ శాస్త్రం, సంప్ర‌దాయాల‌కు క‌ట్టుబ‌డి ఏకాంతంగా నిర్వ‌హించాల్సి ఉంద‌న్నారు. ఉద్యాన‌, విద్యుత్ విభాగాల అధికారులు ఆల‌యం అలంక‌ర‌ణ‌లో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవాల‌ని ఆదేశించారు. ఆరోగ్య సిబ్బంది పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వాహ‌న‌సేవ‌ల‌ను ఎస్వీబిసీ ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తామ‌‌న్నారు. ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న మ‌రోసారి స‌మీక్ష నిర్వ‌హించి తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని జెఈవో తెలిపారు.

జెఈవో (విద్య, వైద్యం) ‌శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, సిఇ శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబుస్వామి,  అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, తిరుప‌తి అర్బ‌న్ అద‌న‌పు ఎస్పీ శ్రీ‌మ‌తి సుప్ర‌జ‌, విజివోలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ ప్ర‌భాక‌ర్‌, ఉద్యాన విభాగం ఏడి శ్రీ శ్రీ‌నివాసులు, ప‌చాయ‌తి ఈవో శ్రీ జ‌నార్థ‌న్ రెడ్డితో పాటు వివిధ‌ విభాగాల‌ అధికారులు స‌మీక్ష‌లో పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.