విజయవంతంగా ఏడాది పూర్తిచేసుకున్న పరకామణి సేవ

విజయవంతంగా ఏడాది పూర్తిచేసుకున్న పరకామణి సేవ

తిరుమల, 20 ఆగష్టు : తిరుమల శ్రీవారి ఆలయంలో హుండీ కానుకలను లెక్కించేందుకు, 2012 ఆగస్టు 17వ వతారీఖున ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పరకామణి సేవ  శ్రీవారి ఆశీస్సులతో ఏడాది పూర్తి చేసుకొని విజయవంతంగా రెండవ ఏడాదిలోనికి అడుగు పెట్టింది. ఇప్పటి వరకు 106 బ్యాచ్‌లు సమర్థవంతంగా పరకామణిసేవను పూర్తి చేసుకొని ప్రస్తుతం 107వ బ్యాచ్‌ పరకామణి సేవలో సెవలందిస్తుండడం విశేషం.

తి.తి.దే యాజమాన్యం పరకామణిలో శ్రీవారి సేవకుల అవసరాన్ని గుర్తించి ప్రారంభించిన పరకామణి సేవ అనతికాలంలోనే ప్రసిద్ధి పొంది, తి.తి.దే అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా సేవలందిస్తూ ముందుకు సాగుతున్నది. తొలుత బ్యాచ్‌కు 50 మందికి వరకు మాత్రమే అవకాశం కల్పించిన తి.తి.దే యాజమాన్యం ఈ సేవ అనతి కాలంలోనే సాధించిన ఫలాల దృష్ట్యా సేవకుల సంఖ్యను ప్రస్తుతం 80 మందికి పెంచింది. ఇప్పటి వరకు 107 బ్యాచ్‌లకు గాను 5011 మంది సేవకులు విశేష సేవలందించారు.

వాస్తవానికి 2012 ఆగస్టు 17వ వతారీఖున ప్రవేశపెట్టిన పరకామణి సేవ, మొదటి బ్యాచ్‌ 2012 ఆగస్టు 20వ తేది నుండి 14 మంది సేవకులతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ సేవ ఏడాది కాలంలోనే అనుకున్న లక్ష్యాలు సాధించింది.  
ఇప్పటి వరకు పరకామణి సేవలో పాల్గొన్న సేవకుల వివరాలు

ఆంధ్రప్రదేశ్‌  నుండి 4025

కర్ణాటక రాష్ట్రం నుండి 466

తమిళనాడు రాష్ట్రం నుండి 435

కేరళ రాష్ట్రం నుండి 25 మొత్తం 5011

ఇతర వివరాలు

ప్రస్తుతం పనిచేయువారు విశ్రాంత ఉద్యోగులు మొత్తం

ప్రభుత్వ ఉద్యోగులు 2482 696 3178

ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఉద్యోగులు 460 94 554

బ్యాంకు ఉద్యోగులు 530 327 857

ఇన్సూరెన్సు ఉద్యోగుల 365 57 422

మొత్తం 3837 1174 5011

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.